పాకిస్తానీతో అంజూ లవ్‌.. ఫ్యామిలీ పరిస్థితే దారుణం?

ఇప్పుడు ఒక దేశంలోని ఆడవాళ్లు పక్కనున్న మరో దేశం లోనికి ప్రేమ పేరుతో వెళ్తూ ఉండడం ఎక్కువైపోయింది. ముఖ్యంగా మొన్న ఇద్దరు పాకిస్తాన్ వాళ్ళు అలాగే ఒక బంగ్లాదేశ్ అమ్మాయి ఒక పోలాండ్ ఇంకా ఒక శ్రీలంక దేశాలకు సంబంధించిన ఆడవాళ్లు ప్రేమ పేరుతో సరిహద్దులను దాటేస్తున్నారు. ఇప్పుడు ఇదే కోవలోకి వస్తుంది అంజు అనే మధ్యప్రదేశ్ కు చెందిన అమ్మాయి.

మధ్యప్రదేశ్ లోని భూపాల్ కు సంబంధించిన అంజు అనే అమ్మాయి ఆమె తన స్నేహితుడిని కలవడానికి పాకిస్తాన్ లోని కైబర్ ఫక్తూమాకి  భారత దేశ సరిహద్దును దాటి మరీ వెళ్ళిందట. ఆమెకు ఆల్రెడీ పెళ్లి అయ్యి పిల్లలు కూడా ఉన్నారని సమాచారం.  పాకిస్థాన్ లోని తన స్నేహితుడిని పెళ్లి చేసుకున్న ఈ అంజు ఫాతిమా అనే పేరుతో చెలామణీ అవుతుందట. అక్కడ మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ కి చెందినటువంటి అమ్మాయి ఫేస్ బుక్ లో పరిచయమైన నసరుల్లాని పెళ్లి చేసుకోవడం కోసం పాకిస్తాన్ కి వెళ్ళింది.

ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కోసం ప్రత్యేకించి తన మతాన్ని కూడా ఆమె మార్చుకుంది. దీంతో అంజు ఇప్పుడు వార్తల్లో నిలుస్తుంది. దాంతో ఇప్పుడు ప్రపంచం దృష్టి అంతా అంజూ  కుటుంబ సభ్యులపై కూడా పడింది. అంజూ కుటుంబ సభ్యుల విషయానికొస్తే అంజూ భర్త, అంజు సోదరుడు ఇక అంజూ తండ్రి వీళ్ళందరూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ బ్రతుకుతుంటారట.

అంజు ఈ విధంగా చేయడం వల్ల ఇప్పుడు  వాళ్ళు చేసుకునే చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేక పోతున్నారని తెలుస్తుంది. అంజు భర్త పనిచేసే చోట ఆయనని ఉద్యోగం నుండి అయితే తీయలేదు గాని పని ఇవ్వకుండా కూర్చోబెడుతున్నారట. అంజు సోదరుడికి అయితే ఉద్యోగం తీసేసారని తెలుస్తుంది. టైలర్ అయినటువంటి అంజి తండ్రి గతంలో మంచి బిజీగా పని చేసేవాడట. కానీ ఇప్పుడు జనాలు ఆయన దగ్గరకు కూడా రావడం లేదని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: