ఇక చంద్రబాబు జన్మలో సీఎం కాలేరా?
జగనన్న ఉంటే పేదలకు పండగ అని... కార్మికులు, కర్షకులు, బడుగు, దళిత, గిరిజన, మైనార్టీ వర్గాలకు పండుగ అన్న వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి .. జీడిపల్లి, మాల్యాల రిజర్వాయర్లు నేనే కట్టానని చంద్రబాబు బోగస్ మాటలు చెబుతున్నాడన్నారు. 2014లో ఆయన అధికారంలోకి వచ్చేనాటికి నాలుగుసార్లు జీడిపల్లి రిజర్వాయర్‌ను నీటితో నింపారని వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గుర్తు చేశారు. రాజశేఖర్‌రెడ్డి జీడిపల్లి రిజర్వాయర్‌కు నీళ్లు తెస్తే చంద్రబాబు సిగ్గులేకుండా తప్పుడు కూతలు కూస్తున్నాడని వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు.
కర్నాటక నుంచి నీళ్లు తీసుకొని వస్తానంటున్న చంద్రబాబూ.. నువ్వేమైనా పుడింగివా అని వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. పేరూరు డ్యాంకు పైసా ఖర్చు లేకుండా నీళ్లు తీసుకురావచ్చని వందసార్లు చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదని.. నీహయాంలో ఏమైనా చెవ్వులో సీసం పోసుకుని ఉన్నావా అని చంద్రబాబును వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు.
చంద్రబాబు హయాంలో నీళ్లు ఇచ్చింటే ఆయనకే మంచిపేరు వచ్చేదని.. బాధ్యత కల్గిన ప్రతిపక్ష నాయకుడిగా తాను ప్రరతిపాదనలు చేస్తే పట్టించుకోకుండా బాబు చేయాల్సిన దోపిడీని చేసేశారని వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శించారు. హంద్రీ –నివా పేజ్ –2 పనుల్లో మిగిలిపోయిన 10 కోట్ల పనులను 100 కోట్లకు పెంచేసుకుని చంద్రబాబు దోపిడీ చేశారని వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శించారు.