టీడీపీలోకి వచ్చి చిక్కుల్లో పడిన కన్నా?
కానీ గుంటూరు జిల్లా సత్తెనపల్లి కి సంబంధించినటువంటి ప్రాంతంలో మీరు మీ రాజకీయాలు చేసుకోవచ్చని చంద్రబాబు చెప్పడం అదేవిధంగా కన్నా లక్ష్మీనారాయణ అక్కడ చురుగ్గా పాల్గొనడంతో కోడెల శివప్రసాదరావు మాజీ మంత్రి కొడుకు కోడెల శివరాం తో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర సందర్భంగా కోడెల శివరాం కన్నా లక్ష్మీనారాయణ వర్గానికి మధ్య చిన్నప్పటి ఘర్షణలే జరుగుతున్నాయి.
కోడెల శివరాం కూడా ఇప్పుడు కనక పోటీ చేయకపోతే మరోసారి పోటీ చేసే అవకాశం ఉండకపోవచ్చు. నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేకత, గుర్తింపు అనేది ఉండవు. తద్వారా ఉనికి కోల్పోయే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారు. బీజేపీని కాదని చంద్రబాబుని నమ్ముకుని వచ్చిన కన్నా కూడా పోటీలో నిలబడకపోతే తన రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది వస్తుందని ఆయన భావిస్తున్నార. కానీ చంద్రబాబు నాయుడు దీనిపైన ఏ మాత్రం స్పందించడం లేదు. కన్నా లక్ష్మీనారాయణ టికెట్ ఇస్తున్నాడా లేదా కోడెల శివరామకు ఇస్తాడా అనేది ఇంకా సందిగ్ధంలో ఉంది.
ముందు పని చేసుకుంటూ వెళ్ళండి తర్వాత ఆలోచిస్తామని విధానంతో బాబు వెళ్తున్నాడు. కానీ కన్నా లక్ష్మీనారాయణకు ముందు హామీ ఇచ్చిన తర్వాతనే టీడీపీ లోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి రాబోయే రోజుల్లో సత్తెనపల్లిలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.