కేసీఆర్‌కు కరంట్‌ షాక్‌ ఇచ్చిన జగన్‌?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగే నాటికి తెలంగాణలో పవర్ సమస్య తీవ్రంగా ఉంది. ఎందుకంటే ఎక్కువగా పవర్ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉండడం దీంతో తెలంగాణ మాకు కూడా పవర్ ప్రాజెక్టులో హక్కులు ఇవ్వాలని విభజన సమయంలో కోరింది. అయితే ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ కు మిగులు కరెంటు ఉండడం వల్ల తెలంగాణకు కరెంటు ఇవ్వాలని కేంద్రం సూచించింది.


అయితే అప్పుడు కరెంటు సప్లై ఎక్కువగా ఉండటం వల్ల ఇతర రాష్ట్రాలకు ఆంధ్ర ప్రదేశ్ అమ్ముకునేది. అదే సందర్భంలో తెలంగాణకు కూడా అమ్మితే వాళ్లు డబ్బులు ఇస్తారని కేంద్రం చెప్పింది. అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వం కరెంట్ వాడుకొని సుమారు 6000 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెల్లించలేదు. ఇదేంటి అని అడిగితే అది తెలంగాణ హక్కు అని చెప్పారు.


తెలంగాణ ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా ఉమ్మడి రాష్ట్రంలో నెల్లూరులో కృష్ణపట్నం వద్ద నిర్మించిన ప్రవర్ ప్రాజెక్టులో మాకు కూడా హక్కు వస్తుందని మిగతా పవర్ ప్రాజెక్టుల్లో తెలంగాణ కూడా హక్కు ఉంటుందని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వమే దాదాపు 8 వేల కోట్లు తెలంగాణకు చెల్లించాల్సి ఉంటుందని మాట్లాడింది. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వంని పార్లమెంటులో ఏపీ ప్రభుత్వం ప్రశ్నించింది. మాకు రావాల్సిన ఆరువేల కోట్ల డబ్బుని తెలంగాణ ప్రభుత్వం చెల్లించడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు.


దీంతో కేంద్రం ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణకు  రిజర్వు బ్యాంకు ద్వారా ఇవ్వాల్సిన వాటాల నుంచి 6000 కోట్లను కట్ చేసుకుని ఇస్తామని ఏపీ ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే తెలంగాణలో బీజేపీ పుంజుకోవాలని ప్రయత్నిస్తున్న సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సాహసోపేతం. ఇదే సందర్భంలో అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ అంశం కలిసొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అవి బీజేపీ పై బీ ఆర్ఎస్ ఎలాంటి విమర్శలు చేస్తుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

KCR

సంబంధిత వార్తలు: