పీకల్లోతు కష్టాల్లో మాజీ మంత్రి నారాయణ?
అయితే విద్యా సంస్థల్లో ఉన్న సమస్యలు చాలవన్నట్లు కుటుంబ విషయాల్లో కూడా ప్రస్తుతం వివాదాలు బయటకొచ్చాయి. నారాయణ మరదలు ప్రియా ఆయనపై లైంగిక ఆరోపణలు చేశారు. పెద్ద కుటుంబంలో స్వేచ్ఛగా జీవించిన వారు అత్తగారింటికి వచ్చిన తర్వాత చాలా వరకు ఇబ్బందుల పాలవుతారు. ప్రియ ఏకంగా నారాయణపై ఆరోపణలు చేశారు. నారాయణపై కేసు పెట్టింది.
ప్రియ పేరు మీద కొంత భూమి కొన్నారని ఆ భూమి వాల్యూ ఇప్పుడు చాలా పెరిగిపోయిందని అది ఇప్పుడు నారాయణకు ఇవ్వనని మొండికేసినట్లు తెలుస్తోంది. అయితే అదే మాట అంటుందని ఊహించిన నారాయణ తమ్ముడు ప్రియ భర్త ఆమె మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు బయటకొచ్చి వివరణ ఇచ్చాడు.
ఇదంతా కావాలనే చెప్పారని బయట వినిపిస్తున్న టాక్. ఇలా చెబితే ఆమె గురించి ఎవరూ నమ్మరని నారాయణకు ఉన్న పేరు ప్రఖ్యాతల ముందు ఆమె తేలిపోతుందని భావించినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ నారాయణ మరదలు సోషల్ మీడియాలో వివరణ ఇచ్చిన విధానం, పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన తీరు చూస్తే ఆమెకు ఎలాంటి మానసిక ఆరోగ్య ఇబ్బంది లేదన్నట్లే కనిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో నారాయణ ఫ్యామిలీ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందో చూడాలి.