నారాయణ లైంగిక వేధింపులు.. ఆ మీడియాకు పట్టవా?

మాజీ మంత్రి నారాయణ కాలేజీ అధినేత నారాయణపై ఆయన మరదలు తీవ్ర ఆరోపణలు చేశారు. లైంగికంగా వేధించాడని, గృహ హింస చేశారని సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టింది. దీంతో ఆ పోస్టు క్షణాల్లో వైరల్ గా మారి నారాయణ అసలు రంగు బయటపడిందని అందరూ కామెంట్లు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్ద విద్యాసంస్థలైన నారాయణ విద్యా సంస్థలకు అధిపతిపై ఇలాంటి సంచలన వ్యాఖ్యలు సొంత ఇంటి నుంచే రావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

అయితే టీడీపీ హయాంలో ముఖ్యమంత్రిగా చేసిన నారాయణపై ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేస్తే ఎల్లో మీడియా కనీసం ఒక్క పేపర్ లో వార్త రాలేదు. ఒక్క మీడియా చానల్ దాన్ని హైలెట్ చేయలేదు. కారణం కోట్ల రూపాయల యాడ్ లు ఆయా టీవీ చానళ్లకు, పేపర్లకు నారాయణ ఇస్తుంటారు. ఒక మహిళ అది కూడా సొంత మరదలు మాజీ మంత్రి, తెలుగు రాష్ట్రాల్లోనే గొప్ప విద్యా వ్యాపార వేత్త అయిన నారాయణపై చేస్తే డబ్బుల కోసం మీడియా దాన్ని కనీసం ప్రొజెక్టు చేయడం లేదు. ప్రజలకు తెలిసేలా వార్తలు రాయడం లేదు.

వైసీపీ ప్రభుత్వంలో ఏస్ వీ బీసీ చానళ్ హెడ్ గా చేసిన పృథ్వీరాజ్ ఒక మహిళతో అసభ్యంగా మాట్లాడితే మాత్రం దాన్ని తెగ వైరల్ చేశారు. అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ లాంటి వారి ఆడియోలు కూడా వైరల్ అయ్యాయి. వీటిపై పుంఖాను పుంఖానులుగా చర్చలు జరిపారు. మీడియాలో పత్రికల్లో వైరల్ చేశారు. చివరకు పృథ్వీరాజ్ పదవి కూడా పోయింది. దీనిపై ఏ రాజకీయ పార్టీ స్పందించడం లేదు.

ఏ ఇతర పత్రికలు పెద్దగా వార్తలు ప్రచురితం చేయడం లేదు. కేవలం డబ్బుల సంపాదనే లక్ష్యంగా పత్రికలు, మీడియా ఛానళ్లు నడుస్తున్నాయడానికి నారాయణ ఉదంతం మంచి ఉదాహరణగా చెప్పొచ్చు. మరి ఇంతకంటే దారుణాలు చేసినా డబ్బుల కోసం వార్తలు రాయడం మానేస్తాయోమోనని ప్రజలు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: