అప్పట్లో కిరణ్ కుమార్‌రెడ్డి.. ఇప్పుడు చంద్రబాబు?
తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి ఎక్కువ నిధులు కేటాయించిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇరిగేషన్ శాఖను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని ఆయన అన్నారు. 2014-19 లో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు సాగు నీటి ప్రాజెక్టుల కోసం 68,293 కోట్లను ఖర్చుపెట్టిందని, వైసిపి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల కోసం 22 వేల 165 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని ఆయన లెక్కలు చెప్పారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో ఇరిగేషన్ శాఖ పడకేసిందని ఆయన అన్నారు. జగన్ ఒక అజ్ఞాని అని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసమర్థత వల్లే సాగునీటి రంగం వెనుకబడిపోయిందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల విషయంలో స్పష్టంగా తన వివరణను ఇచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కోస్తాంధ్రలో 96, రాయలసీమలో 102 ఇలా దాదాపుగా 198 ప్రాజెక్టులు మూతపడ్డాయని ఆయన చెప్పుకొచ్చారు.
ఇలా జగన్ వచ్చిన తర్వాత ప్రాజెక్టులన్నీ ఆగిపోయాయని చంద్రబాబు అన్నారు. సంవత్సరాల వారీగా 2014-15లో సాగునీటి ప్రాజెక్టుల కోసం 317 కోట్లు బడ్జెట్ పెడితే, 9223 కోట్లు ఖర్చు పెట్టామని ఆయన చెప్పారు. ఇలా 2014 నుండి 2019 వరకు 55893 కోట్లు ఖర్చు పెట్టామని ఆయన చెప్పుకొచ్చారు. సాగునీటి రంగానికి జగన్ మోహన్ రెడ్డి తీరని అన్యాయం చేస్తున్నారని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.