జగన్‌పై రైతు అస్త్రం ప్రయోగిస్తున్న బాబు?

సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడం అంటే ఇదేనేమో.. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు జగన్ ను విమర్శిస్తూ హైదరాబాద్ లో ఉండి టూరిస్టులా వచ్చిపోయే వ్యక్తి జగన్ అని విమర్శించాడు. కానీ ఇప్పుడు చంద్రబాబు కూడా ఎప్పుడో ఒకసారి ఆంధ్రకు వచ్చి మిగతా టైం మొత్తం హైదరాబాద్ లో ఉంటున్నారు. ఇలా కాలాలతో పాటు వ్యక్తుల తీరు కూడా మారింది. అయితే చంద్రబాబు ఆంధ్రకు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర స్థాయిలో జగన్ పై విరుచుకుపడుతున్నారు.


అయితే అమరావతిలో ఇళ్ల స్థలాల శంకుస్థాపన మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అమరావతి రైతులకు అన్యాయం చేశారు. రాజధాని అంటే ఏదీ.. చెప్పుకోవడానికి ఏదైనా ఉందా? అని అన్నారు. జగన్ పాలనలో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. రైతును జగన్ నట్టేట ముంచేశాడని ఆరోపించారు. జగన్ కు వ్యవసాయం మీద అవగాహన లేదు. ఆహార అలవాట్లకు అనుగుణంగా పంటలు మారాలి. కానీ వాటిని మార్చడంలో జగన్ విఫలమయ్యారు.


రైతుల ఆత్మహత్యల్లో ఏపీ దేశంలో మూడో స్థానం అని అన్నారు. ఏపీలో గంజాయి తప్ప మరోది సాగు కావడం లేదన్నారు. ఏపీలో 93 శాతం రైతులు అప్పుల పాలయ్యారు. తప్పుడు లెక్కలు చూపడంలో జగన్ సిద్ధహస్తుడు. దేశంలో సగటు రైతు అప్పు 74 వేలు ఉంటే, ఆంధ్రప్రదేశ్ లో 2.45 లక్షలు ఉందన్నారు.


ఏపీలో భూముల ధరలు తీవ్రంగా పడిపోయారు. కరోనా సమయంలో అందరూ హాలిడే తీసుకుంటే రైతులే పంటలు పండించారు. హర్టికల్చర్, అగ్రికల్చర్ రంగాన్ని వెనక్కి నెట్టేశారు. ఆక్వా రంగాన్ని పట్టించుకోవడం లేదు. టీడీపీ హయాంలో 6 వేల ట్రాక్టర్లు ఇచ్చామన్నారు. కానీ జగన్ మాత్రం రైతులను అస్సలు పట్టించుకోవడం లేదని తీవ్ర స్థాయిలో విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: