జగన్‌పై పవన్ కొత్త అస్త్రం.. పని చేస్తుందా?

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో విద్యార్థులకు బైజుస్ కంటెంట్ తో కూడిన ట్యాబులు ఇవ్వడం పై ఇటీవల తన భావాలను వ్యక్తం చేసారు. ట్యాబ్లు ఇవ్వడం మంచిదే అని.. కానీ ముందుగా పాఠశాలల్లో మరుగు దొడ్లు నిర్మించాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు. టీచర్స్ చెప్పవలసిన పాఠాలు యాప్స్ చెప్పడం ఏంటనే ఉద్దేశంతో ఆయన వ్యాఖ్యానించారు. మార్కెట్ లో ఒక్కొక్క ట్యాబ్ విలువ దాదాపుగా 18,000 నుండి 20,000 వరకు ఉంటుందని ఆయన అన్నారు.


ప్రభుత్వం దాదాపు 580కోట్లు ఈ బైజూస్ కంటెంట్ లోడ్ చేసిన టాబ్లెట్స్  కోసమే ఖర్చు చేసిందన్నారు. మరి వచ్చే సంవత్సరం రాబోయే ప్రభుత్వం కూడా 580 కోట్లు ఖర్చు పెట్టి 5లక్షల ట్యాబ్లు కొంటుందా అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం స్టాండర్డ్ ప్రోటోకాల్ను పాటించిందా? అని ఆయన ప్రశ్నించారు. లేదంటే బైజుస్ కంపెనీ వారు ప్రతీ సంవత్సరం ఈ ట్యాబ్ లను విద్యార్థులకు ఉచితంగా ఇస్తారా? అనేది క్లియర్ చేయాలన్నారు. బైజూస్ సంస్థ  ప్రతీ సంవత్సరం ఉచితంగా కంటెంట్ ఇస్తామని ఇప్పటి వరకు చెప్పలేదని పవన్ అన్నారు.


జగన్ ప్రభుత్వం వచ్చాక  ఒక్క మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కూడా వెలువడ లేదని, ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ కూడా జరగలేదని ఆయన గతంలోనే ప్రశ్నించారు. టీచర్ ట్రైనింగ్ కూడా జరగడం లేదు అని ఆయన అన్నారు. ఉపాధ్యాయుల నియామకం తప్పనిసరిగా జరగాలని ఆయన పేర్కొన్నారు. యాప్స్ అనేవి ఛాయిస్ మాత్రమే అని, అవి ఉపాధ్యాయులు కాదనే భావాన్ని ఆయన వ్యక్తం చేశారు.


నష్టాల్లో ఉన్నటువంటి ఓ స్టార్టప్ కు వందల కోట్లు కాంట్రాక్టులు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. అసలు ఎన్ని కంపెనీలు దరఖాస్తు చేశాయో, ఎన్ని  టెండర్లలో పాల్గొన్నాయో, ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాలని జనసేన పార్టీ అధినేతగా పవన్ డిమాండ్ చేశారు. అయితే ఇదే బైజుస్ ను గతంలో చంద్రబాబు కూడా విమర్శించారని కొంతమంది అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: