పవన్‌కు పెరుగుతున్న క్రేజ్‌.. టీడీపీకి ఝలక్‌ తప్పదా?

2014 నుంచి జనసేన ఎన్డీఏ లో భాగస్వామిగా ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ఆ పార్టీకి అంతగా ప్రయార్టీ దక్కలేదు. అయినా బీజేపీ నిర్వహించిన ఎన్డీఏ మిత్రపక్షాల మీటింగ్ కు పవన్ కల్యాణ్ కు ఆహ్వానం పలికారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే అందరం ఒక్కటవ్వాలి. అరాచక ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి కచ్చితంగా ఆంధ్రలో టీడీపీ కానీ ఇతర పార్టీలతో కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ మీటింగ్ అనంతరం పవన్ అన్నారు.


తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే సీట్లు ఎన్నిస్తారు. 50 శాతాని కంటే ఎక్కువ సీట్లు ఇస్తారా? అంటే అనుమానమే. అయితే సగానికి పైగా ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేందుకు టీడీసీ సిద్ధంగా లేదు. పోనీ పవన్ కల్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారా అంటే అది లేదు. టీడీపీ చంద్రబాబును తప్ప మరో వ్యక్తిని సీఎంగా చేయడానికి కనీసం ఊహించడం కూడా లేదు.


ఇప్పుడిప్పుడే ఆంధ్రలో జనసేన పార్టీకి వారాహి యాత్రతో క్రేజ్ పెరుగుతుంది. ముఖ్యంగా జనసేనలో చేరేందుకు ఆయా పార్టీల నుంచి అభ్యర్థులు వస్తున్నారు. వైజాగ్ నుంచి పంచకట్ల రమేశ్ టీడీపీకి చెందిన నేత వైజాగ్ నుంచి చేరారు. అయితే ఇక్కడే జనసేన, టీడీపీ బంధం గురించి కొన్ని సందేహాలు తలెత్తుతున్నాయి. జనసేనలోకి టీడీపీ నుంచి వెళుతున్న వారే ఉంటున్నారు. కానీ వైసీపీ నుంచి వస్తున్న వారు కనిపించడం లేదు.


టీడీపీలో టికెట్ ఆశించి దొరకని వారు ఇలా జనసేనకు వెళ్లి పొత్తులో భాగంగా టికెట్ దక్కించుకునేందుకు ఇలా చేస్తున్నారా? లేక టీడీపీయే వారిని పార్టీ మార్పించి జనసేన తరఫున పోటీ చేయించడానికి ఎత్తుగడలు వేస్తుందా అని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. మరి ఎన్నికల నాటికి టీడీపీ, జనసేన బంధం కలిసే ఉంటుందా? వేరు వేరుగా పోటీ చేస్తారా అనేది మరో కొన్ని నెలల వరకు వేచి చూడక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: