పెరుగుతున్న అమరావతి భూముల రేట్లు.. దేనికి సంకేతం?
చాలా మంది కృష్ణా, గుంటూరు మధ్య భూములను తక్కువ ధరలకే అమ్మేసినట్లు ప్రచారం జరిగింది. చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు నష్టపోయినట్లు వార్తలు వచ్చాయి. మూడు రాజధానులు అనగానే అమరావతిలో భూముల జాగలకు రేట్లు సగానికి సగం పడిపోయాయి. కొంతమంది తక్కువకే అమ్మేసుకున్నారు. కోట్ల భూములు లక్షల రూపాయలకు రావడంతో ఏం చేయాలో తోచలేదు. కొత్త కొత్త సంస్థలు వచ్చేస్తున్నాయి.
చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యాక భూముల ధరలకు రెక్కలు వస్తాయనే ప్రచారం జరుగుతోంది. దీంతో మళ్లీ అమరావతి వైపు రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను పడింది. దీంతో హైదరాబాద్ కు చెందిన వారు కూడా ఇక్కడ భూములు కొనేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కొత్త కొత్త కార్లలో వచ్చి రాజధాని చుట్టు పక్కల ప్రాంతాల్లో భూములను వాటి ధరలను తెలుసుకుంటున్నారు. నూతన వెంచర్లను వేసేందుకు సిద్ధమవుతున్నారు. సీఎం అయ్యాక ఎలాంటి పరిస్థితులు ఉంటాయి. ఆయా భూములను వెంటనే తీసుకోవాలంటే కుదరదు.
మళ్లీ అమరావతిలో భూముల ధరలు పెరిగే అవకాశం ఉందేమో అనిపిస్తుంది. అమరావతి రాజధాని నినాదంతో టీడీపీ వెళుతుంది. మూడు రాజధానులను ఎలాగో యాక్సెప్ట్ చేయదు. కాబట్టి అక్కడ మళ్లీ భూముల ధరలకు రెక్కలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి అమరావతి వద్ద రియల్ వ్యాపారులు యాక్టివ్ అయిపోయారు. నూతన వెంచర్లను కొనుగోలు చేసేందుకు, తక్కువ ధరలకు ఎక్కడ భూమి వస్తుందో ఆయా ప్రాంతాల్లో భూములు కొనేందుకు సిద్ధమవుతున్నారు.