రష్యా: పుతిన్ ముస్లింలను రెచ్చగొడుతున్నారా?
నాటోలో స్వీడన్ దేశాన్ని ప్రస్తుతం చేర్చుకున్నారు. ఇది 32వ దేశంగా చేరిపోయింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆక్రమించుకున్న లూహన్ స్కీ, డొనెట్ స్కీ, బాగ్ పుత్, తదితర పట్టణాల్లో ముస్లింలు ఖురాన్ చేతపట్టుకున్న ఫోటోలను పోస్ట్ చేశారు. నాటోలో సభ్యత్వం కోరుతుంది ఉక్రెయిన్. అయితే ఇదే స్వీడన్ లో ఈ మధ్య ఖురాన్ ను దహనం చేశారు. నిరసనకారులకు పోలీసులు పర్మిషన్ ఇచ్చారని, దానికి సంబంధించి కోర్టు అనుమతి ఉందని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు.
కోర్టు ఆరు నెలల పాటు వాదనలు విన్న తర్వాత నిరసన చేసుకోవచ్చని కోర్టు అనుమతినిచ్చింది. అయితే దీన్ని ప్రభుత్వ అధికాారులు అడ్డుకోవాల్సింది పోయి ప్రేక్షక పాత్ర పోషించారు. దీనిపైనే టర్కీ స్వీడన్ దేశం నాటో లో సభ్యత్వ దేశం కాకుండా అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది. మొదట్లో స్వీడన్ నాటో చేరడానికి అంగీకరించలేదు. అయితే అమెరికా మధ్యలో జోక్యం చేసుకుని స్వీడన్ కు నాటో దేశంలో సభ్యత్వం ఇప్పించేలా ఒప్పించగలిగారు. దీంతో ప్రస్తుతం నాటోలో స్వీడన్ సభ్య దేశంగా మారిపోయింది. చివరకు టర్కీకి ఏదో బహుమనం ఇచ్చారు.
దీన్ని సాకుగా చూపిస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్ వివిధ మతాలకు స్వేచ్ఛ లేని నాటోలో ఉక్రెయిన్ చేరాలనుకుంటుంది. స్వీడన్ చేసిన పని చూడాలని ముస్లింలకు నాటో దేశాలు వ్యతిరేకమనే వాదనలను పుతిన్ తెరపైకి తీసుకొచ్చారు. దీంతో ముస్లింలకు దగ్గరవుతూనే నాటో దేశాల గురించి ప్రపంచానికి చెప్పేందుకు ప్రయత్నించారు.