వైసీపీకి బంపర్ మెజారిటీ.. 168 సీట్లు వస్తాయా?
గత ఎన్నికల్లో తెలంగాణలో 43 శాతం ఓట్లతో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 88 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్, బీజేపీ లకు చాలా తక్కువ శాతం ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ స్థానాల్లో కేవలం 1 సీటుకే బీజేపీ పరిమితమైంది. కానీ కాంగ్రెస్ దాదాపు 18 స్థానాల్లో విజయం సాధించింది. కానీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చే సరికి సీను మారిపోయింది. ఇదే లెక్కన వేసుకుంటే దాదాపు అప్పటి టీఆర్ఎస్ పార్టీ 14 ఎంపీ స్థానాల్లో విజయం సాధించాలి. కానీ 9 ఎంపీ స్థానాలకే పరిమితమైంది. ఒక్క ఎమ్మెల్యే స్థానం గెలుచుకున్న బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకుని అబ్బురపరిచింది. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే వచ్చిన ఈ మార్పు ఎవరూ ఊహించలేరు.
అదే విధంగా టైమ్స్ నౌ చేసిన సర్వేకు ఎన్నికలకు ఇంకా దాదాపు 9 నెలల సమయం ఉంది. అప్పటివరకు ఓటరు నాడీ మారిపోవచ్చు. విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఆరు ఎమ్మెల్యే స్థానాలు గెలిచిన వైసీపీ ఆ ఎంపీ స్థానాన్ని మాత్రం కోల్పోయింది. అలాగే గుంటూరులో కూడా ఆరు ఎమ్మెల్యే స్థానాలు గెలిచి కూడా టీడీపీ ఎంపీ సీటు గెలుచుకుంది.
పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలకు తేడా చాలా ఉంటుంది. ఓటర్లు చాలా ఆలోచించి ఓట్లు వేస్తారు. 168 అసెంబ్లీ స్థానాలు వస్తాయని అనుకోవడం మాని ప్రజల్లోకి వెళ్లి మ్యాజిక్ ఫిగర్ సాధించేందుకు ప్రయత్నం చేయాలి.