జగన్ స్వయంగా.. పవన్‌కు క్రేజ్ పెంచుతున్నారా?
ఇప్పుడు పవన్ కళ్యాణ్ జగన్ పేరుని ఉద్దేశించి విమర్శిస్తున్నారు. అలాగే జగన్ కూడా పవన్ ని పేరు పెట్టే విమర్శిస్తున్నారు. అయితే గతంలో చంద్రబాబు నాయుడు ఆవేశంగా ప్రసంగాలు ఇచ్చేటప్పుడు బాలకృష్ణ తొడలు కొడుతూ మాట్లాడటం చేసేవారు. దానికి ప్రతిగా అప్పుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి వాళ్లకు వ్యతిరేకమైన పద్ధతిలో అంటే చాలా కామ్ గా, కూల్ గా తాను కొంతమందిలా మీసాలు తిప్పలేనని, తొడలు కొట్టలేనని, తాను కోరుకునేది పేదలకు మంచి వైద్యం, ఫీజు రీయింబర్స్మెంట్, ఉండడానికి ఇల్లు ఇలాంటివి మాత్రమేనని వైయస్ రాజశేఖర్ రెడ్డి అనేవారు.
ఇప్పుడు అదే తరహాలో రాజశేఖర్ రెడ్డి వారసుడైన జగన్ కూడా తన పద్ధతిని కొనసాగిస్తున్నారు అన్నట్లుగా తెలుస్తుంది. జగన్ పవన్ కళ్యాణ్ పేరు ఎత్తినా కూడా పవన్ కళ్యాణ్ లా తీవ్రంగా స్పందించకుండా చాలా కూల్ గానే తన మాటలతో ఎదురు దాడి చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఆ మాటలు కాస్తా వ్యక్తిగత విమర్శలుగా మారిపోతున్నాయి.
పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు గురించి జగన్ పదేపదే ప్రస్తావిస్తున్నారు. అమ్మ ఒడి ఇస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి జగన్ 2014నుండి పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి మాట్లాడిన మాటల్లో ఈ పెళ్లిళ్ల ప్రస్తావనే తీసుకొచ్చారు. అది కూడా పవన్ కళ్యాణ్ పై కూల్ గానే ఎదురు దాడి చేశారు. 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీలకు తాను పూచీ అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఇంకా చంద్రబాబు తర్వాత వాటి ఊసే ఎత్తలేదు అని ఆయన అన్నారు.