బాబుకు చేజేతులా ఛాన్స్ ఇస్తున్న జగన్?
జగన్ అప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు అనే ఆలోచనను అమలు చేస్తాను అని చెప్పేసరికి అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానివల్ల చంద్రబాబు నాయుడుకి ఏమి ఉపయోగం జరగలేదు. అంతేకాకుండా అప్పుడు చంద్రబాబు జగన్ పెన్షన్ 2000 రూపాయలు పెంచితే సేమ్ టు సేమ్ చంద్రబాబు నాయుడు కూడా పెన్షన్ 2000 రూపాయలు పెంచి మరీ ఇచ్చాడు.
అప్పుడు జగన్ ఆ పెన్షన్ 3000 రూపాయలకి పెంచుతాను అని ప్రకటించాడు. ఆ విధంగానే 3000 రూపాయలు ఇస్తున్నాడు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు జగన్ హామీలను కాపీ కొట్టి అమలు చేసినా సరే అప్పటికే ఆలస్యం అయిపోవడంతో అవి ఆయనకు అధికారాన్ని దూరం చేశాయి. ఆ తర్వాత జగన్ అమ్మ ఒడి ఇంట్లో ఇద్దరు పిల్లలకు ఇస్తానని చెప్పినా ఒక్కరికి మాత్రమే అమలు చేస్తున్నారు.
అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాత్రం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తానని చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు కొత్తగా ఇచ్చే ఈ హామీలకు జగన్ భయపడడం లేదని తెలుస్తుంది. దానికి నిదర్శనమే తాజాగా అమ్మ ఒడి పథకాన్ని ఇంట్లో ఒక్కళ్ళకు మాత్రమే ఇస్తానని మళ్లీ కరాకండిగా చెప్పడం. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు రకరకాల రాష్ట్రాల్లోని హామీలను దండ గుచ్చి మరి తన సొంత హామీలుగా ప్రకటించడం చేస్తున్నారు. కర్ణాటకలో బిజెపి ఇంకా కాంగ్రెస్, తెలంగాణలో టిఆర్ఎస్, ఆంధ్రాలో జగన్ చెప్తున్న హామీలను కాపీ చేస్తున్నారు చంద్రబాబునాయుడు.