కేసీఆర్‌, రేవంత్‌ శత్రుత్వానికి మూలం అదేనా?

కొన్ని కొన్ని గొడవలు అకస్మాత్తుగా మొదలవుతాయి. అప్పటివరకు ఎంతో అన్యోన్యంగా ఉంటున్న వాళ్లు కాస్త ఏదో ఒక కారణంతో కలహించుకుని బద్ధ శత్రువులుగా మారిపోతారు. కంసుడు తన చెల్లెలు అయిన దేవకిని అల్లారు ముద్దుగా చూసుకునే వాడు. కానీ తర్వాత చూస్తే తన సొంత చెల్లెలు అయిన దేవకికి పుట్టిన పిల్లలందరినీ చంపేశాడు. ఈ సంఘటనల మధ్య ఉన్న కారణం అశరీరవాణి కంసుడితో చెప్పిన మాట.


ఆమెకు పుట్టబోయే మగబిడ్డ కంసుడిని  చంపేస్తాడు అన్న విషయం అది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇద్దరు వ్యక్తులు మధ్యన గొడవ రావడానికి ఒక్క కారణం ఉన్నా చాలు. అలాగే కెసిఆర్ ఇంకా రేవంత్ రెడ్డి వీళ్ళ మధ్య ఎటువంటి శత్రుత్వం లేదు గతంలో. రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉంటే, కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని నడుపుతూ వెళ్ళిపోతూ ఉండేవారు.


కెసిఆర్ ని రేవంత్, రేవంత్ ని కేసీఆర్ ఇలా విమర్శించుకుంటూ ఉండేవారు సాధారణంగా. అయితే కెసిఆర్ ఇంకా చంద్రబాబుల మధ్య ఉన్న గొడవల మధ్యలో అనుకోని విధంగా ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్టు అవ్వాల్సి వచ్చింది. అదే రేవంత్ రెడ్డి లైఫ్ కి టర్నింగ్ పాయింట్ అయిందని చెప్పుకోవాలి ఒక రకంగా. అప్పటివరకు ఆయన  కొడంగల్ నియోజకవర్గానికి ఒక అధికార ప్రతినిధి, వాక్చాతుర్యం కలిగిన ఎమ్మెల్యే.


అలాంటి వ్యక్తి ఒక బలమైన శక్తిగా మారడానికి ఈ కేసు దోహదం చేసిందని తెలుస్తుంది. ఇప్పుడు కెసిఆర్ కి వ్యతిరేకంగా ఏకు మేకులా తయారయ్యి కూర్చున్నాడు రేవంత్ రెడ్డి. నితీష్ కుమార్ తో జరిగిన నిన్నటి మీటింగ్ కి కూడా ఒకరకంగా కేసీఆర్ ని ఇండైరెక్టుగా అడ్డుకున్నది రేవంత్ రెడ్డి అని తెలుస్తుంది. కాంగ్రెస్ అధిష్టానం ద్వారా కేసిఆర్ కు ఆహ్వానం అందకుండా  రేవంత్ రెడ్డి చేశాడని అంటున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే కెసిఆర్ అనుకోకుండా తన శత్రువును తానే తయారు చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: