ఆ దేశాలపై అణు బాంబు లేస్తామంటున్న రష్యా?

రష్యా అధ్యక్షుడు పుతిన్ కు బెలారస్ అధ్యక్షుడు లూహసెంకో మంచి స్నేహితులు. ఒకానొక సమయంలో బెలారస్ లో లూహసెంకోకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాలని పెద్ద ఎత్తున బెలారస్ లో ఉద్యమం కొనసాగింది. దీన్ని రష్యా అధ్యక్షుడు సాయంతో అణిచివేయగలిగారు. బెలారస్ లో నిరసన కారులపై రష్యా సైన్యం, యుద్ధ ట్యాంకులు భీకరంగా విరుచుకుపడ్డాయి.

కొన్ని వందలు, వేల మంది ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. దీంతో బెలారస్ అధ్యక్షుడు లూహసెంకోకు అడ్డు లేకుండా పోయింది. అప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు, బెలారస్ అధ్యక్షుడు ఇద్దరి మంచి మిత్రులుగా ఉన్నారు. అయితే ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ యుద్దం భీకరంగా కొనసాగుతోంది. బెలారస్, ఉక్రెయిన్, రష్యాకు మధ్యలో ఉంది. ఉక్రెయిన్ పై దాడికి బెలారస్ ప్రాంతాన్నే పుతిన్ ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో  బెలారస్ లోకి అణ్వస్త్ర ఆయుధాలను, బాలిస్టిక్ వెపన్స్ ను పంపుతున్నారు.

అయితే బాలిస్టిక్ క్షిఫణులు, ఆయుధాలను ధ్వంసం చేయాలని నాటో దేశాలు ప్లాన్ వేసినట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ కు తెలిసింది. దీంతో ఒక్కసారిగా పుతిన్ నాటో దేశాలను హెచ్చరించారు. బెలారస్ లో ఉన్నవి రష్యాకు సంబంధించిన ఆయుధాలు.. అందులో ఏ ఒక్క ఆయుధం ధ్వంసం అయినా మీ 31 నాటో దేశాలపై అణు బాంబులతో విరుచుకుపడతామని హెచ్చరించారు. నామరూపాల్లేకుండా చేస్తామని హెచ్చరించారు.

అయితే నాటో దేశాలు పోలండ్, ఉక్రెయిన్ తో కలిసి బెలారస్ లో ఉన్న రష్యా ఆయుధ సామగ్రిని ధ్వంసం చేయాలని ప్లాన్ వేస్తున్నాయి. ఇదే గనక జరిగితే పుతిన్ అనుకున్న పని చేస్తాడని రాబోయే రోజుల్లో ఇది అణు విధ్వంసానికి దారి తీసే పరిణామాలు జరుగుతున్నాయని ప్రపంచ మేధావులు ఆందోళన చెందుతున్నారు. ఈ యుద్ధాన్ని ఎలాగైనా ముగించేందుకు ప్రయత్నించాలని ఐక్యరాజ్య సమితి ని కోరుతున్నారు. లేకపోతే రాబోయే రోజుల్లో రష్యా తీసుకునే చర్యలకు అందరూ బలి కావాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: