పెళ్లి లేకుండా పని కానిచ్చేస్తున్న చైనా అమ్మాయిలు?

చైనా లో  ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 6.8 మిలియన్ల పెళ్లిళ్లు మాత్రమే జరిగాయట. ఇది చైనా చరిత్రలోనే అత్యంత దారుణమైన విషయం. గతంలో అంటే 2013లో చూసుకుంటే 13.5 మిలియన్ల పెళ్లిళ్లు జరిగాయని తెలుస్తుంది. 1986 నుండి పెళ్లిళ్ల గణాంకాల లెక్క చూసుకుంటే అత్యంత తక్కువ పెళ్లిళ్లు జరిగిన సంవత్సరం ఇదేనని తెలుస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే దానికి అక్కడ ఉన్న యువతులను ఉదాహరణగా చూపిస్తున్నారట.

మరి వాళ్ళు చేసిన తప్పు ఏమిటి ఈ పరిస్థితికి అని అంటే అది ఆ అమ్మాయిల స్వాభిమానం ఇంకా తన సొంత కాళ్లపై తాను బ్రతకాలని అనుకోవడం అని తెలుస్తుంది. అంటే మగవాళ్ళ తోడు లేకుండానే స్వతంత్రంగా బ్రతకాలని వాళ్లు అనుకుంటున్నారని తెలుస్తుంది. దానికి కారణం పెళ్లి అయిన తర్వాత పెరిగే సంసార ఖర్చులు అట. పిల్లల ఖర్చులు, ఈ అమ్మాయిల తల్లిదండ్రుల పోషణ ఇవన్నీ ఆలోచించి వాళ్లు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది.

పెళ్లిళ్ల కోసం అబ్బాయిలు అమ్మాయిల వెనకాల పడుతున్నా సరే అక్కడ అమ్మాయిలు పట్టించుకోవడం లేదని తెలుస్తుంది. చివరికి పెళ్లిళ్ల సమయంలో ఎదురు కట్నం ఇవ్వడానికి సిద్ధమవుతున్నా సరే అక్కడి అమ్మాయిలు ముందుకు రావడం లేదట. దాంతో అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం కూడా ముందుకు కదిలి అడుగు ముందుకేసి మరీ రకరకాల పథకాల ద్వారా అక్కడున్న వాళ్ళను జంటలుగా చేయడానికి ప్రయత్నిస్తుందని తెలుస్తుంది.

30 రోజులు ప్రేమించుకోమని, ఇంకా పెళ్లిళ్లు చేసుకుంటే ఇంత ప్రోత్సాహక నగదు ఇస్తామని ఆఫర్ ఇస్తుందట. అక్కడ పబ్బుల్లో కూడా ప్రత్యేక ఈవెంట్లను వీళ్ళ కోసం నిర్వహిస్తున్నారట. పెళ్లి చేసుకొని పిల్లలను కంటే వాళ్ళ చదువులకి ఇంత అని డిపాజిట్ చేస్తామని కూడా అక్కడి ప్రభుత్వాలు ముందుకొస్తున్నాయని తెలుస్తుంది. ఇది కాకుండా ఇప్పుడు చైనా కి మరో సమస్య ఏంటంటే వచ్చే రెండేళ్లలో 30 శాతం మంది ప్రజలు అక్కడ వృద్ధులు మాత్రమే ఉండబోతున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: