జైలుకు జగన్.. టీడీపీ కల ఇప్పుడు నెరవేరుతుందా?

పల్నాడు జిల్లా కోసూరులో ఇటీవల జరిగిన విద్యా కానుక కిట్ల పంపిణీలో  వైఎస్ జగన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తనకు అండగా లేకపోయినా దేవుడి దీవెనలు, ప్రజల ఆశీస్సులు ఉంటే చాలు అని అన్నారు. అయితే ఇన్ని రోజులు బీజేపీ వైసీపీకి అండగా ఉందా అంటే తెలుగుదేశం, దాని అనుకూల మీడియా చేస్తున్న ప్రచారం అలానే అనిపిస్తుంది. కానీ బీజేపీ సిద్దాంతం వేరు, వైసీపీ సిద్ధాంతం వేరు.


ఈ సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబును, దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ ని విమర్శించారు. కానీ అంతకుముందు జగన్ అవినీతి పాలనపై విమర్శలు చేసిన బీజేపీ అగ్ర నాయకుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను మాత్రం పల్లెత్తు మాట అనలేడు. దీనికి కూడా కారణం ఉందని ఒక వేళ అమిత్ షాను ఏమైనా విమర్శిస్తే జగన్ జైలుకు వెళ్లడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి.


దీన్ని కూడా ఎల్లో మీడియా ప్రచారం చేస్తుంది. ఇన్ని రోజుల నుంచి బీజేపీతో జగన్ పొత్తు పెట్టుకున్నట్లు అండ లేకపోయినా ప్రజల ఆశీస్సులు ఉంటే చాలు అనడంతో దాన్ని వక్రీకరించి బీజేపీ, వైసీపీ ఒక్కటే అని ప్రచారం చేసేస్తున్నాయి. బీజేపీతో కలిసి ఉంటే ఆంధ్రప్రదేశ్ లో సోము వీర్రాజు ఎందుకు 18 సార్లు అరెస్టయి జైలుకు వెళ్లారు. వైసీపీ చేస్తున్న అనేక కార్యక్రమాలకు వ్యతిరేకంగా ధర్నాలు, నిరసనలు చేపట్టి జైలుకు వెళ్లారు.


ముఖ్యంగా కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు అందనపుడు, ఒక వేళ అవే పథకాలు ప్రజలకు చేరువైనపుడు మాత్రమే సోము వీర్రాజు స్పందించారు తప్ప ఏనాడు వైసీపీకి అనుకూలంగా బీజేపీ ఉందని కానీ, వారితో పొత్తు పెట్టుకున్నట్లు ఏనాడు చెప్పలేదు. కానీ టీడీపీ అనుకూల మీడియా ఇన్ని రోజులు బీజేపీతో అనుకూలంగా ఉండి ఇప్పుడు ఏమీ తెలియనట్లు వైఎస్ జగన్ నటిస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: