కాంగ్రెస్‌ కట్టడి కోసం.. కేసీఆర్‌ ముందస్తు వ్యూహం?

మొన్నటి దాకా సీఎం కేసీఆర్ ఆలోచన కర్ణాటకలో ఎలాగైనా బీజేపీ ఓడిపోవాలి. అది జరగడంతో కేసీఆర్ ఆనందం వ్యక్తం చేసినా.. దిగజారిపోయినా కాంగ్రెస్ అక్కడ గెలవడంతో ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఉత్సాహంతో ముందుకు దూసుకెళుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నేరుగా తెలంగాణలో అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ మొన్నటి వరకు తెలంగాణలో రెండో స్థానంలో ఉందని అందరూ అనుకున్నారు.


కానీ ఒక్కసారిగా కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో ఇక్కడి కాంగ్రెస్ శ్రేణుల్లో ఎనలేని ఉత్సాహం పెరిగిపోయింది. ఇదే సందర్భంలో కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన వారిని తిరిగి రావాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోరుతున్నారు. ఎలాగైనా సరే కేసీఆర్ ను ఓడించాలని కృత నిశ్చయంతో ఉన్నారు. దీంతో సీఎం కేసీఆర్ తెలంగాణలో రాజకీయ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ కర్ణాటక ఎన్నికట్లో కుమారస్వామి పార్టీకి మద్దతు ఇచ్చి పక్కన నిలబడ్డారు. కానీ స్వయంగా పోటీలో దిగలేదు.


ప్రస్తుతం సీఎం కేసీఆర్ తెలంగాణలో ముందస్తుకు వెళతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ముందస్తుకు వెళ్లడం వల్ల కాంగ్రెస్ కు కుదురుకునే చాన్స్ ఇవ్వడం కుదరదు. బీజేపీకి పూర్తి స్థాయిలో అభ్యర్థులు లేరు. వారు అభ్యర్థుల ఎంపిక, వీరికి ప్రచార ఆర్భాటాలు లేకపోవడం తో సరైన సమయం వారికి ఇవ్వకుండా ముందస్తుకు వెళ్లాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. రాబోయే వి మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికలు ఉన్నాయి.


వాటితో పాటే వెళ్లాలని కేసీఆర్ అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. జులై రెండో వారం నుంచే ముందస్తు కు వెళ్లే ప్లాన్ ను సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి ముందస్తుకు వెళ్లడం వల్ల బీఆర్ఎస్ కు లాభం చేకూరుతుందా.. లేక కాంగ్రెస్ విజయం సాధిస్తుందా.. కర్ణాటకలో ఓడినా బీజేపీ తిరిగి తెలంగాణలో విజయ కేతనం ఎగరవేస్తుందా.. ఏదేమైనా ప్రస్తుతం కేసీఆర్ ఆలోచన ఎలా ఉండబోతుందన్నదే ఆసక్తికరమైన అంశం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: