ఆ నిర్ణయంతో సంచలనం సృష్టిస్తున్న జగన్?
దీనికి సంబంధించి డాక్టర్ల అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ వైద్య విదాన పరిషత్ ఇప్పటివరకు హెల్త్ డిపార్ట్ మెంట్ లో భాగంగా ఉండేది. అయితే 24 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సాలరీస్ కు అనుగుణంగా ఏపీ సెకండరీ హెల్త్ కేర్ కు మార్చారు. దీంతో గవర్నమెంట్ ఎంప్లాయిస్ గా తీసుకున్నట్లు ఏపీ క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. వైద్యులకు సరైన జీతాలు కావాలని చాలా ఏళ్ల నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కానీ ఇప్పటి వరకు డాక్టర్ల జీతాలను పెంచేందుకు ఏ ప్రభుత్వం ముందుకు రాలేదు.
ప్రస్తుతం జీతం పెంచేందుకు ముందుకొచ్చిన వైఎస్ జగన్, సజ్జల రామకృష్ణ రెడ్డి, హెల్త్ మినిస్టర్ విడుదల రజినికి రుణ పడి ఉంటామని డాక్టర్లు చెబుతున్నారు. గతంలో వైద్యులకు సపోర్టు ఇచ్చే వారు కాదు. ప్రస్తుతం జగన్ తీసుకొచ్చిన రూల్ ప్రకారం.. డాక్టర్ కి బేసిక్ సాలరీ రూ. 85 వేలు, వెయ్యి మందికి పైగా స్పెషలిస్టు డాక్టర్ల నియామకం, గిరిజన ప్రాంతాల్లో సేవ చేసే డాక్టర్లకు నెలకు రూ. 2.50 లక్షల వరకు జీతం ఇస్తారు. మొత్తం మీద జగన్ సర్కారు డాక్టర్లకు ప్రాధాన్యత నిచ్చి వారికి జీతాలు పెంచేసింది. ఇకపై గ్రామాల్లో, గిరిజన ప్రాంతాల్లో సేవ చేయడానికి డాక్టర్లు మొగ్గు చూపుతారా? లేక గతంలో లాగే పట్టణాల్లోనే ప్రైవేటు ఆసుపత్రుల వైపు పయనిస్తారా చూడాలి.