వాట్‌నెక్స్ట్: జగన్‌కూ బీజేపీ గట్టి వార్నింగే ఇచ్చిందా?
భారతదేశంలో మోడీ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారని ఆయన అన్నారు. గడిచిన తొమ్మిదేళ్ల నుండి మోడీ నుండి అద్భుతమైన పరిపాలనని మనం చూస్తున్నాం అని ఆయన చెప్పుకొచ్చారు. ఓటు కోసం చేసే అక్రమమైన పనులు, డబ్బు కోసం చేసే పనులను అధికారం కోసం చేసే పనులను ఆయన సక్రమంగా, దుర్వినియోగం అవ్వకుండా రాజకీయాలను ముందుకు తీసుకు వెళ్ళగలుగుతున్నారు.
రాజకీయాల్లో సరికొత్త మార్పును ఆయన తీసుకొచ్చారని తెలుస్తుంది. పేదల పక్షపాతిగా ముందుకు వెళ్తున్న మోడీ పరిపాలన సక్రమంగానే సాగుతుందని చాలామంది అభిప్రాయం అని ఆయన అన్నారు. మోడీ వచ్చేవరకు 59 గ్రామాలకు మాత్రమే ఫైబర్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటే మోడీ వచ్చిన తర్వాత అన్ని గ్రామాల్లో ఈ ఫైబర్ ఇంటర్నెట్ కనెక్టివిటీని పెంచారు అని తెలుస్తుంది. 2లక్షల నిరుపేద గ్రామాలను మోడీ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని తెలుస్తుంది.
ఐదు రూపాయలకు 5 కోట్ల మంది ప్రజలకు బియ్యాన్ని అందిస్తున్నారు. 50 కోట్ల మంది ప్రజలకు వైద్యం నిమిత్తం ఆయుష్మాన్ భవ పేరుతో ఐదు లక్షల డబ్బును అందిస్తున్నారు. 4 కోట్ల ఇల్లు దేశవ్యాప్తంగా నిర్మాణాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద డబుల్ బెడ్రూం ఇళ్ళు కూడా అందించింది మోడీ ప్రభుత్వం. చాలామంది ఇలా పథకాలు ప్రకటించి వదిలేయడమే కాకుండా వాటిని పటిష్టంగా అమలు చేయడం కూడా మోడీ పరిపాలన విజయవంతం అవ్వడానికి ఒక కారణమని తెలుస్తుంది. చెప్పాలంటే 9ఏళ్ళ మోడీ పాలన సక్సెస్ అయినట్టుగా తెలుస్తుంది.