రామోజీ క్రెడిబిలిటీని దెబ్బతీయలేకపోతున్న జగన్‌?

రామోజీరావు మీద నమ్మకమో, రామోజీరావు నిర్వహించే మార్గదర్శి పై నమ్మకమో కానీ చాలా మంది ప్రజలు రామోజీరావుని బలంగా నమ్ముతున్నట్లుగా తెలుస్తుంది. దానికి కారణం ఏదైనా కావచ్చు కానీ ఆయన మాత్రం ప్రభుత్వం తనను టార్గెట్ చేస్తున్నా కూడా, ఒక రకంగా చెప్పాలంటే నిబ్బరంగానే కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. అదే ఏ సహారా గ్రూపో, అగ్రిగోల్డ్ గ్రూపు వాళ్ళో అయితే సీను అలా ఉండదని తెలుస్తుంది.

అసలు సహారా గ్రూపు, అగ్రిగోల్డ్ గ్రూపు ఇంకా మార్గదర్శి గ్రూపులో మధ్యన పెద్ద తేడా ఉంది. వాటిలో డబ్బులు ఉన్నా కూడా సాంకేతిక నిబంధనలను సరిగ్గా పాటించడం లేదని ఆ సంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకుని కేసులు వేసింది. ఆ సంస్థ ఆస్తులు కూడా జప్తు చేసింది. అయితే రామోజీరావుకి వచ్చిన కష్టంలో పదో వంతు కష్టం ఇది. కానీ ఆ కష్టానికి కూడా వాళ్లు విలవిలలాడిపోతున్నట్లుగా తెలుస్తుంది.

రామోజీరావుకి సంబంధించిన ఆస్తులను ప్రభుత్వం అటాచ్ చేస్తూ ఆయనపై సిఐడి వరుస పెట్టి దర్యాప్తు జరుగుతున్నా సరే ఆయన మాత్రం బెణకడం లేదని తెలుస్తుంది. ఇదివరకు తన నడిపే సంస్థలో తేడా ఉందని ఆ సంస్ధను ఆయనే స్వయంగా మూసివేసిన సంగతి తెలిసిందే. ఆ సంస్థలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళ డబ్బులు కూడా ఆయన రీపే చేసారు. దాంతో ప్రజల్లో ఆయన పై విశ్వసనీయత పెరిగింది. ఆయనను నమ్మే వాళ్లు వందల్లో కాదు లక్షల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది.

జగన్ రామోజీరావుని ఎంత టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టాలనుకున్న కూడా జగన్ కన్నా కూడా రామోజీరావుని జనాలు ఎక్కువ నమ్ముతున్నారంటూ కొంతమంది అంటున్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణలో 2316 గ్రూపులు ఒక్కో గ్రూప్ కి 50 మంది సభ్యులు చొప్పున సుమారుగా 2 లక్షల 15 వేల మంది ఖాతాదారులు మార్గదర్శిలో చిట్స్ వేసి ఉన్నారు. అయితే వీళ్ళు అందరూ రామోజీరావు మీద నమ్మకంతో భయం లేకుండా నిబ్బరంగా ఉన్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: