అమిత్‌షాతో భేటీ తర్వాత బాబు మౌనం.. ఇందుకేనా?

టీడీపీ అధినేత చంద్రబాబు పై ఆ పార్టీ కార్యకర్తలను పూర్తి నమ్మకం ఉంటుంది. జాతీయ పార్టీలతో పొత్తుల విషయంలో చంద్రబాబు చెప్పినట్లు  ఇతర పార్టీలు  వినేలా చేయడంలో ఆయన దిట్ట. ఈ విషయంలో పూర్తి నమ్మకంతో తెలుగుదేశం కార్యకర్తలు ఉంటారు. అదే స్థాయిలో చంద్రబాబు కూడా పార్టీని ఎక్కడా డ్యామేజ్ చేయకుండా రాజకీయ చతురతలో వ్యవహరిస్తారు.

కానీ గత సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ఘోర తప్పిదం చేశాడని చాలా మంది కార్యకర్తలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభిప్రాయ పడ్డారు. దీని వల్ల టీడీపీ కేవలం 23 స్థానాల్లో గెలుపొంది ప్రతిపక్ష పార్టీ పాత్రకే పరిమితమైంది. ఈ సారి బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గతంలో బీజేపీని ఎండగట్టిన వైనంపై బీజేపీ అధిష్టానం అంత త్వరగా స్పందించడం లేదు.

దీని కోసం మధ్య వర్తిగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ, టీడీపీ రాష్ట్రంలో పొత్తు పెట్టుకుంటే రాబోయే కాలంలో వైసీపీ చిత్తవ్వడమే కాకుండా టీడీపీ కేంద్రంలో ప్రధాన పాత్ర పోషించవచ్చని చూస్తోంది. కానీ ఆంధ్రలో స్థానిక బీజేపీ నాయకులు మాత్రం టీడీపీతో పొత్తు ఉండదని తెగేసీ చెబుతున్నారు. ఇదే తరహాలో బీజేపీ అధిష్టానం కూడా ఏ మాత్రం నోరు విప్పడం లేదు.

కానీ టీడీపీ అధినేత మాత్రం కేంద్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఆశిస్తోంది. గత అనుభవాల దృష్ట్యా టీడీపీ అధినేత చంద్రబాబును నమ్మవద్దని స్థానిక బీజేపీ నాయకులు అధిష్టానానికి చెబుతున్నట్లు తెలుస్తోంది. కానీ బీజేపీతో పొత్తు సాధిస్తే మాత్రం చంద్రబాబు విజయం సాధించినట్లే. కానీ లోకల్ లో బీజేపీ నాయకులకు మాత్రం పొత్తు విషయంలో ఎలాంటి స్పష్టత లేనట్లు తెలుస్తోంది. వైసీపీని ఎలాగైనా ఈ సారి ఓడించి రాష్ట్రంలో అధికారం చేపట్టాలని చూస్తోన్న టీడీపీ రాబోయే ఎన్నికల నాటికి ఎవరితో పొత్తులు పెట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: