యోగి ప్రధాని అయితే.. పీవోకే మనదేనా?

జమ్మూ కాశ్మీర్ అంశంపై ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పాకిస్థాన్ అప్పుల్లో కూరుకుపోయి సంక్షోభంలో ఉంది. ఇలాంటి సమమంలో కాశ్మీర్ ను ఇండియా తిరిగి స్వాధీనం చేసుకున్నా అక్కడి ప్రజలు ఇండియాకు బ్రహ్మరథం పట్టే అవకాశం ఉందని అన్నారు. ఇప్పుడు బీజేపీ నుంచి యోగి ఆదిత్యనాథ్ ను సీఎంగా ఉన్నా రాబోయే ప్రధాన మంత్రి అని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

నరేంద్ర మోదీ ప్రధాని కాకముందు బీజేపీ అధిష్టానం ఎల్ కె అద్వానీని ప్రధానమంత్రి అభ్యర్థిగా అనుకున్నారు. కానీ మోదీ అభివృద్ధి మంత్రం పేరుతో సోషల్ మీడియా, టీవీ ఛానళ్లు తెగ ప్రచారం చేసి ప్రధాని క్యాండిడేట్ గా చెప్పేశాయి.  కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి క్యాండిడేట్ గా అని అందరికీ తెలిసిందే..

ప్రస్తుతం మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కఠిన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. జమ్మూ కాశ్మీర్ లో  370 ఆర్టికల్ రద్దు, అయోధ్య రామమందిర నిర్మాణం, ట్రిపుల్ తలాక్, నోట్ల రద్దు లాంటి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇలాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నా సమయంలో అందరూ మోదీని కీర్తించారు. కొంతమంది విమర్శించినా అవి సరైనవి  అని చాలా మంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

ఇంకా కొంతమంది మాత్రం మోదీ కాస్త మృదువుగానే చెబుతారు. కొన్ని నిర్ణయాలు ఆచి తూచి తీసుకుంటారు. కానీ యోగి ఆదిత్య నాథ్ అలా కాదు. డేరింగ్ అండ్ డాషింగ్  కాబోయే ప్రధాని అంటూ సోషల్ మీడియాలో బీజేపీ అనుకూల వాదులు తెగ ప్రచారం చేసేస్తున్నారు. యోగి కూడా ఈ మధ్య మాట్లాడుతూ..  పాకిస్థాన్ ఇండియాపై ఎన్నో కుట్రలు పన్నింది. ఇప్పుడు కాశ్మీర్ ను స్వాధీనం చేసుకునే సమయం వచ్చింది. దీన్ని అనుకూలంగా మలుచుకుని పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను ఇండియా కైవసం చేసుకోవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: