రాహుల్‌.. ఇండియా పరువు తీస్తున్నారా?

రాహుల్ గాంధీ తాజాగా అమెరికా వెళ్లారు. భారత దేశంలో ఎస్సీ ఎస్టీ, మైనార్టీలకు అన్యాయం జరుగుతోందని దశాబ్దాలు గడుస్తున్నా ఇండియాలో ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరగడం లేదంటూ ఒక సమావేశంలో అన్నారు. దేశం గురించి అవమాన పరిచే విధంగా మాట్లాడటం వెనక మోదీ చేస్తున్న విధానాలు తప్పని చెప్పేందుకు అలా ప్రసంగించరని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎక్కువ కాలం పాటు దేశంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీనే అని అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం బీజేపీ పాలన కలుపుకుని కమలం పార్టీ దాదాపు 15 సంవత్సరాలు అధికారంలో ఉన్నట్లు తెలుస్తోంది. జనతా పార్టీ ఇతర పార్టీలు కలిసి సుమారు ఒక మూడేళ్లు అధికారంలో ఉన్నాయి. వీటిని మినహాయిస్తే 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో దాదాపు 50 ఏళ్ల కంటే ఎక్కువ కాంగ్రెస్ అధికారంలో ఉంది.

మరి అప్పుడు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఎందుకు న్యాయం చేయలేదని రాహుల్ గాంధీ పై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అత్యధిక మంది కాంగ్రెస్ నుంచి ఎంపీలుగా ఎన్నికై 50 సంవత్సరాలు అధికారంలో ఉండి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అభివృద్ధి చేయకపోవడం వెనక మతలబు ఏమిటని చాలా మంది ప్రశ్నిస్తున్నారు.

రాహుల్ గాంధీ చేసిన ప్రచారం మోదీ వర్సెస్ రాహుల్ లా ఉండాలి. కానీ  దేశం గురించి తక్కువ చేసి మాట్లాడటం అనేది రాహుల్ గాంధీకి తగదని అంటున్నారు. రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వం గురించి మాట్లాడుతూ.. రిజర్వేషన్లు తీసేశారనో... ఎస్సీ, ఎస్టీల ప్రాధాన్యం తగ్గిస్తున్నారనో విమర్శిస్తే దానికి అర్థం ఉండేది. కానీ దేశం గురించి తక్కువ చేసి మాట్లాడటం పై మండిపడుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యల్ని ఖండించకుండా సమర్థించే వాళ్లను చూసి ఏమనుకోవాలో అర్థం కావడం లేదని, దేశం ఏమైపోయినా పర్లేదు తమ నాయకుడు మాత్రం బాగుండాలనే విధానం మారితేనే భారత్ బాగుపడుతుండని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: