బాబోయ్‌.. ఇవాళ, రేపు ఎండలే ఎండలు?

నైరుతి రుతుపవనాలు తదుపరి 48 గంటల్లో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు,  కొమోరిన్ ప్రాంతం, దక్షిణ బంగాళాఖాతం, తూర్పు మధ్య బంగాళాఖాతం లోని మరికొన్ని ప్రాంతాలలోకి  మరియు ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని.. అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.  3 )ఉపరితల ఆవర్తనం ,దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ & పరిసరాల్లో సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో  ఉన్నదని.. కోస్తా ఆంధ్ర ప్రదేశ్ నుండి తమిళనాడు మీదుగా, మన్నార్ గల్ఫ్ వరకు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో  ఉన్న ద్రోణి బలహీన పడినదని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

దీని ప్రభావంతో రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయి. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో తేలిక పాటి నుండి ఒక మోస్తరు    లేదా ఉరుములతో కూడిన జల్లులు  ఒకటి  లేదా రెండు చోట్ల  కురిసే అవకాశం ఉందని.. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని.. గరిష్ట ఉష్ణో గ్రతలు క్రమముగా  2 నుంచి 4 డిగ్రీల సెంటి గ్రేడ్ వరకు పెరిగే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

రేపు, ఎల్లుండి కొన్నిచోట్ల వాతావరణం పొడి గా ఉండే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణో గ్రతలు క్రమముగా  2 నుంచి 4 డిగ్రీల సెంటి గ్రేడ్ వరకు పెరిగే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా  ఆంధ్రప్రదేశ్ లో తేలిక పాటి నుండి ఒక మోస్తరు    లేదా ఉరుములతో కూడిన జల్లులు  ఒకటి  లేదా రెండు చోట్ల  కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని..గరిష్ట ఉష్ణో గ్రతలు  క్రమముగా  2 నుంచి 4 డిగ్రీల సెంటి గ్రేడ్ వరకు పెరిగే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వివరించింది.

రేపు, ఎల్లుండి వాతావరణం పొడి గా ఉండే అవకాశం ఉందని.. గరిష్ట ఉష్ణో గ్రతలు క్రమముగా  2 నుంచి 4 డిగ్రీల సెంటి గ్రేడ్ వరకు పెరిగే అవకాశం ఉందని.. రాయలసీమలో తేలిక పాటి నుండి ఒక మోస్తరు    లేదా ఉరుములతో కూడిన జల్లులు  ఒకటి  లేదా రెండు చోట్ల  కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: