బాబు, జగన్‌ పోటీ.. ఏపీ శ్రీలంక ఖాయం?

ఎలక్షన్ సమయం దగ్గర పడుతుంది. ఎలక్షన్ కు ఇక ఒక ఏడాది మాత్రమే గడువు ఉంది. కాబట్టి ఎలక్షన్ సమయం దగ్గర పడుతూ ఉండడంతో అన్ని రాజకీయ పార్టీలు తమ హామీలను ప్రజలపైకి ఎక్కుపెడుతున్నట్లుగా తెలుస్తుంది. జగన్ 2019 ఎలక్షన్లకు ముందు నవరత్నాలు అని ప్రకటించినప్పుడు ఆయన నవరత్న హామీ పథకం పైన చాలా కామెంట్లు చేసుకుంటూ వచ్చారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు.

కానీ ఆ నవరత్నాలు అనే హామీలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల మనసులోకి చేరుకున్న తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్లు కూడా ఏమి చేయడానికి లేక ఊరుకోండి పోయారు.  అయితే వాళ్లు ఇప్పుడు నవరత్నాల పథకంలోని కొన్ని హామీలను మోడల్ గా తీసుకొని వాళ్ల ఎలక్షన్ల మేనిఫెస్టోను విడుదల చేసినట్లుగా కూడా తెలుస్తుంది. గతంలో ఈ నవరత్నాలు అనే హామీలను అమలు చేస్తే ఏపీ ఇంకో శ్రీలంక లేదా వెనిజులా అవుతుందని ప్రచారం చేసినా, జనాలు పట్టించుకోకపోవడంతో  తెలుగుదేశం పార్టీ వాళ్ళు తగ్గాల్సి వచ్చింది.

ఇప్పుడైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పంచ సూత్రాలు, అష్ట నియమాలు ఆచరణలోకి తీసుకురాబోతున్నారట. అయితే అసలైనటువంటి హామీలు ముందు ముందు జనాలకి అందబోతున్నాయన్నట్లుగా చెప్పుకొస్తున్నారట వైసీపీ శ్రేణులు. అవి నవరత్నాల కన్నా ఎక్కువగానే ఉండవచ్చని అనుకుంటున్నారట సాధారణ జనం. రైతుకు రుణ భరోసా ఏదైతే కేంద్రం 6000, రాష్ట్రం ఏడున్నర వేలు ఇలా మొత్తం అందిస్తుంది 13,500‌. అయితే భవిష్యత్తులో దీన్ని 25 వేలకు తీసుకువెళ్తారని తెలుస్తుంది.

అయితే ఇప్పుడు దీనికి తెలుగుదేశం వస్తే 20,000 వరకు అందిస్తామని చెప్తున్నారట. అంటే కేంద్రం 6000, రాష్ట్రం 14000 చొప్పున అందిస్తామని అంటున్నారట. అలాగే ఇప్పటివరకు అమ్మ ఒడి తరపున ఇంటికి ఒకరికి అందిస్తున్న సహాయాన్ని ఇంటిలో ఇంకొక వ్యక్తికి కూడా అందించబోతున్నారు అన్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనిని చంద్రబాబు నాయుడు ఇంటిలో ఇద్దరు ముగ్గురికి ఉన్నా కూడా అందిస్తాం అన్నట్లుగా చెప్తున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: