జగన్‌ ముందస్తు: జూన్ 7న ఏం జరగబోతోంది?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఇటీవల నీతి ఆయోగ్, నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. సీఎం జగన్ ఢిల్లీలో ఉండగానే రామోజీ రావుకు చెందిన దాదాపు రూ. 719 కోట్ల ఆస్తులను సీఐడీ ఆటాచ్ చేసింది. జగన్ గేమ్ మొదలెట్టాడనే ప్రచారం జోరుగా జరుగుతోంది. అయితే జగన్ ఢిల్లీలో ఉండగానే జూన్ 7న  క్యాబినేట్ సమావేశం ఉంటుందని సర్క్యూలర్ విడుదలైంది.

జగన్ అక్కడ ఉండగా ఇక్కడ క్యాబినెట్ మీటింగ్ అంటే ముందే చెప్పి ఉంటారని అందరు అనుకున్నారు. కానీ ఢిల్లీ వెళ్లిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ముందస్తు ఎన్నికలకు వెళతారనే ప్రచారం విపరీతంగా జరుగుతోంది. జనసేన సోషల్ మీడియా కూడా ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తుకు వెళతారనే తెగ ప్రచారం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ పూర్తిగా లైన్ లోకి వచ్చే లోపు ఎన్నికలకు వెళ్లాలని జగన్ భావిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఒక వేళ పవన్ వచ్చి టీడీపీతో కలిస్తే ఈజీగా ఓడిపోతామని జగన్ అనుకుంటున్నట్లు జనసేన, టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

సీఎం జగన్ పదవీ కాలం ఇంకా ఏడాది పాటు ఉంది. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లడం అంటే సవాలుతో కూడుకున్న పనే. కాబట్టి అలా చేయకపోవచ్చని రాజకీయ నిపుణులు అంటున్నారు. ఒక వేళ జనసేనకు టైం ఇవ్వకపోతే.. టీడీపీ, వైసీపీ మధ్యనే పోటీ ఉంటుంది. కాబట్టి అప్పుడు వైసీపీ ఈజీగా గెలవవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కానీ చాలా మంది తెలంగాణ ఎన్నికలతో వెళ్లే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అప్పుడు సెటిలర్ల ఓట్లు టీడీపీ పడకపోతే వైసీపీ గెలిచే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మరి టీడీపీని జగన్ దెబ్బకొడతారా.. వైసీపీని విజయ తీరాలకు చేర్చడంలో జగన్ సఫలం అవుతాడా కొన్ని రోజుల్లో తేలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: