మొదలైన ఈడీ కాక.. చంద్రబాబుకు తిప్పలు తప్పవా?

సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని పలు అంశాల మీద విచారణకు ఆదేశించారు.  అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా అంశాలను అన్నింటిని కలిపి కేబినేట్ మీటింగ్ జరిపారు. తర్వాత కోర్టు కేసులు వచ్చాయి. అక్కడ స్టే దొరికింది. హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీం కోర్టు వెకేట్ చేసింది. ఈ కేసుపై మళ్లీ  విచారణ రాష్ట్ర హైకోర్టు చేయొచ్చని ఆదేశించింది. చంద్రబాబు, టీడీపీ మంత్రి నారాయణపై అమరావతి భూ కుంభకోణం కేసు గురించి విచారణ కొనసాగుతోంది. దాంట్లో అటాచ్ మెంట్ నోటీసులు ఇచ్చారు.

సాహితీ ఇన్ ఫ్రా, రామకృష్ణ రియల్ ఎస్టేట్ లు లింగమనేని అనే వారు అందరూ లబ్ధి పొందారని సీఐడీ చెప్పింది. అమరావతి భూ కుంభ కోణంలో విపరీతంగా డబ్బులు సంపాదించుకున్నారనే వివరాలతో ఈడీ సాహితీ ఇన్ ఫ్రా పై విచారణ జరుపుతోంది. సాహితీ ఇన్ ప్రా కంపెనీ కి సంబంధించిన పూర్ణ అనే వ్యక్తి ఇంట్లో విచారణ చేపట్టింది. పూర్ణకు సంబంధించిన ఇళ్లు, ఆఫీసులు అన్ని చోట్ల ఈ కేసుకు సంబంధించిన వివరాలపై ఈడీ ఏక కాలంలో విచారణ ప్రారంభించింది.  

ప్రస్తుతం టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అమరావతి భూ కుంభకోణంలో ఏమేం జరిగాయి. ఎన్ని ప్రాంతాల్లో డబ్బులు చేతులు మారాయి. ఎక్కడెక్కడి నుంచి ఏయే సంస్థల నుంచి నిధులు మళ్లాయి. తదితర అన్ని వివరాలను ఈడీ సేకరించనుంది. భూమి విలువను అమాంతం పెంచి రాజధాని ప్రాంతంలో టీడీపీ నాయకుల అనుచరులు, ఇతర వ్యాపారస్తులు తక్కువ ధరకే భూములను కొన్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఇలాంటి సమయంలో సాహితీ ఇన్ ప్రా అనే సంస్థ లావాదేవీలపై ఈడీ విచారణ చేపట్టింది. ఈ సంస్థ అమరావతి కుంభకోణంలో ఎలాంటి పాత్ర పోషించింది. ఏమైనా అవినీతికి పాల్పడిందా.. అనే వివరాలు విచారణలో తేలనున్నాయి. అమరావతి రాజధాని విషయంలో ఎందరి పేర్లు బయటకు వస్తాయో, ఏయే రాజకీయ నాయకుడి హస్తం ఉందో ఈడీ తేల్చే పనిలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: