జగన్, చంద్రబాబు..ఇద్దరూ కోరుకునేది అదే?

ఏ రాష్ట్రంలోనైనా అధికార పక్షం ఉంటుంది. ప్రతిపక్షం ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య వాదోపవాదాలు, భేదాభిప్రాయాలు ఉంటాయి. ఒకరి తప్పులను ఇంకొకరు ఎత్తిచూపుకుంటూ గొడవ పడుతూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఈ విషయం మరింతగా హైలైట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు అంటే జగన్ కి, జగన్ అంటే చంద్రబాబు నాయుడుకి పడదు. ఆ పార్టీలు వాళ్లు కూడా ఒకళ్ళంటే ఒకళ్ళు ఘర్షణలు పడుతూ ఉంటారు.

జగన్ ఒక ప్రాజెక్ట్ అంటే చంద్రబాబునాయుడు మరో ప్రాజెక్ట్ అంటారు. అలా ఒకరిని ఒకరు విభేధించుకుంటూ ఉంటారు. మరి ఇలాంటి వ్యక్తులు ఇద్దరూ కలిసి ఒకే తాటి కిందకి వస్తారా అంటే వచ్చారు అని చెప్తున్నారు సోషల్ మీడియా వర్గాలు. ఇంతకీ చంద్రబాబు నాయుడు ఇంకా జగన్ ఏకతాటి పైకి వచ్చిన ఆ విషయం ప్రధాని నరేంద్ర మోడీ అని తెలుస్తుంది. వీరి ఇద్దరికీ సంబంధించిన సోషల్ మీడియా ఇంకా అభిమానులు కూడా ఈవేళ మోడీ ప్రభుత్వం ఇక్కడి రాష్ట్రాలలో గెలవకూడదు అనుకుంటున్న సందర్భం.

మొన్న కర్ణాటకలో బిజెపి ఓడిపోయే సరికి సంబరం చేసుకున్న వాళ్లలో ఈ వర్గాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి బిజెపి ఎందుకు గెలవకూడదు అనుకున్నారంటే బిజెపి కనుక కర్ణాటకలో గెలిచి ఉంటే, ఆ తర్వాత తెలంగాణలో కూడా గెలుస్తుందని దాని తర్వాత ఏపీలో కూడా గట్టి మెజార్టీతో గెలుస్తుందని అంటున్నారు వాళ్లు. కానీ బిజెపి అలా తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ లో గెలిస్తే కనుక ఈ రాష్ట్రాలకు సంబంధించిన అధికార పార్టీలకు ఇబ్బంది ఏర్పడే పరిస్థితి వస్తుందని అంటున్నారు.

ముఖ్యంగా వైఎస్సార్సీపి ఇబ్బంది పడుతుందని తెలుస్తుంది. ఎందుకంటే అది ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి. తెలుగుదేశం విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీ అటు కర్ణాటకలో ఎలాగూ ఓడిపోయింది. తెలంగాణలో కూడా ఓడిపోతే గనుక ఇక ఆంధ్రలో దానిని అడ్డంగా చూపించి వీళ్ళు గెలవడానికి ఉపయోగపడుతుందని వాళ్ళ ఆలోచన అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: