పొత్తుల చిక్కులు.. పవన్‌ కల నెరవేరదా?

జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షం మాత్రమే కానీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీకి అనుబంధ సంస్థ మాత్రం కాదు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే మొన్న పవన్ కళ్యాణ్ బిజెపి తోను, ఇంకా తెలుగుదేశం పార్టీ తోను కలిసి సాగుతామని చెప్పడం జరిగింది. అసలు విషయం ఇక్కడే ఉంది, ఈ మాటలోనే ఉంది అంటున్నారు కొంతమంది. పవన్ కళ్యాణ్ బిజెపి రాష్ట్ర నాయకత్వంతోనూ, ఇంకా కేంద్ర నాయకత్వంతో కూడా పొత్తులు కలపడానికి అడుగులు వేస్తున్నారు.

పొత్తులు కలుపుకోవాలి అనే ఆలోచన ఉండడంలో తప్పులేదు ఎందుకంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ సొంత పార్టీ కాబట్టి అది ఆయన ఇష్టం. అయితే ఆయన ఈ ఆలోచనపై ఇంకా బిజెపి రాష్ట్ర నాయకత్వం ఏమి సమాధానం ఇవ్వలేదని తెలుస్తుంది. కానీ ఈయన కేంద్రం దగ్గరికి వెళ్లి మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ వరకు బానే ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్న పార్టీ. వాళ్ల సిద్ధాంతాలు వాళ్ళ విధానాలు వాళ్లకు ఉంటాయి.

మరి భారతీయ జనతా పార్టీ ఏదో తన చెప్పినట్టే నడుచుకుంటుంది అన్నట్లుగా, తన ఆలోచననే బిజెపి ఆలోచనగా ఎలా చెప్తారు అని అడుగుతున్నారు కొంతమంది. అసలు పవన్ కళ్యాణ్ కు తెలుగుదేశం పార్టీతో పొత్తుల కలుపుకుంటామని బిజెపి ఏమైనా చెప్పిందా అని అడుగుతున్నారు కొంతమంది. లేదా తాను చెప్తే బీజేపీ చెప్పినట్టే అని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారా అని అడుగుతున్నారు.

అసలు ఏ రకంగా బిజెపి తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తుందని పవన్ కళ్యాణ్ చెప్పారు అని వాళ్ళు అడుగుతున్నారు. దీనిపై బీజేపీ యొక్క రాష్ట్ర నాయకత్వం ఎవరూ అడగరు. ఎందుకంటే పవన్ నడ్డా దగ్గరికి వెళ్లి వచ్చాడు కాబట్టి. రాష్ట్ర నాయకత్వమే వెళ్లి ఈ విషయం ఎంతవరకు కరెక్ట్ అనేది కేంద్రాన్ని అడిగి తేల్చుకోవలసిన బాధ్యత ఉంది. ఇక ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: