ఉత్తరాంధ్ర వైసీపీలో ముసలం పుట్టిందా?

గత ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ఇన్ చార్జిగా విజయసాయి రెడ్డిని జగన్ నియమించారు. ఆ తర్వాత ఉత్తరాంధ్ర ఇన్ చార్జిగా వైవీ సుబ్బారెడ్డిని పెట్టారు. అనంతరం అనుబంధ సంఘాల కన్వీనర్ బాధ్యత ఇచ్చారు. అయితే వైవీ సుబ్బారెడ్డి ఉత్తరాంధ్ర ఇన్ చార్జిగా ఉంటూ తన దైన మార్కును చూపించాలని అనుబంధ సంఘాల కన్వీనర్లను మార్చుతూ ఉత్తర్వులు ఇచ్చారు. vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">విజయసాయి రెడ్డి నియమించిన వారిని తొలగించి వేరే వాళ్లను పెట్టారు. దీంతో విజయ సాయి రెడ్డి కూడా తక్కువ తినలేదు. వైవీ సుబ్బారెడ్డి నియమించిన వారిని తీసేసి పాత వాళ్లను పెడుతున్నట్లు ప్రకటించారు. దీన్ని ఇప్పుడు తెలుగు దేశం అనుకూల మీడియా హైలైట్ చేస్తోంది.

వైవీ సుబ్బారెడ్డి నియమించిన అధికారులను vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">విజయసాయి రెడ్డి తొలగించారని విపరీతంగా ప్రచారం చేసేస్తోంది. అయితే వైసీపీ కేంద్ర కార్యాలయం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">విజయసాయి రెడ్డి ఇలా చేశారని చెబుతోంది. ఒక్కరోజులోనే ఇలా నియమించిన వారిని తీసేసి పాత వారిని పెట్టారని తెలుస్తోంది. vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">విజయసాయి రెడ్డి అనుబంధ విభాగాల కన్వీనర్ గా ఉత్తరాంధ్రలో చేసినపుడు విశాఖ, అనకాపల్లి, శ్రీకాకుళం లాంటి ప్రాంతాల్లో పార్టీకి సంబంధించిన జోనల్ ఇన్ చార్జిలను నియమించారు.

యువజన విభాగం ఇన్ చార్జిగా సునీల్ కుమార్, మహిళ విభాగం గరికని గౌరీ పేరును తెర పైకి తెచ్చారు. ఈ లోపు వైవీ సుబ్బా రెడ్డి ఇన్ చార్జిగా వచ్చి రావడంతోనే భీమిలి ఎమ్మెల్యే ముత్తం శెట్టి శ్రీనివాస్ కొడుకు ముత్తం శెట్టి వెంకట శివసాయి సందీప్ ను యువజన విభాగానికి ఇన్ ఛార్జిగా కన్పర్మ్ చేశారు. మహిళ విభాగానికి శీలా వెంకట లక్ష్మీ పేరును ఖరారు చేశారు. అయితే ఆ తర్వాత వీరిని మార్చేసి 11 తారీఖున పాత వారినే నియమిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. దీంతో vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">విజయసాయి రెడ్డి పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారని టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేసేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: