పాకిస్తాన్‌: ఇమ్రాన్‌ఖాన్‌ ప్లాన్‌ వర్కవుట్ అయ్యిందా?

ఎక్కడైనా ఇప్పటివరకు సైన్యం ప్రభుత్వంపై తిరగబడటం చూసాం. కానీ ఒక సైన్యం రెండు వర్గాలుగా విడిపోయి వాళ్ళల్లో వాళ్ళు విభేదించుకునే  పరిస్థితిని అయితే మనం పాకిస్తాన్ లోనే చూడగలము అంటున్నారు. అక్కడ సైన్యం లోని ఒక వర్గం ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా ఉంటే, మరో వర్గం ఇమ్రాన్ ఖాన్ కు మద్దతు ఇస్తుందంట. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులను ఏమీ చేయమంటూ మాట్లాడిన ఆ సైన్యంలో 157 మందిని అరెస్టు చేసి జైల్లో పెట్టారని తెలుస్తుంది.

అక్కడ నేషనల్ యాంటీ కరప్షన్ బ్యూరోతో ఇమ్రాన్ ఖాన్ ని 8రోజులు కస్టడీలో ఉంచి విచారించమని కోర్టే చెప్పింది. ఈ విచారణ నిమిత్తం ప్రతిరోజు కోర్టుకు వీడియో కాల్ రూపంలో ఇమ్రాన్ ఖాన్ ను లైవ్ లో చూపించాలి. అయితే తనకు ఇంజక్షన్ ఇచ్చి చంపేస్తున్నారు, తనను టాయిలెట్ కి కూడా వెళ్ళనివ్వడం లేదు అని అంటూ చెప్పుకొచ్చాడు ఇమ్రాన్ ఖాన్. అది చూసిన ప్రజలు మరింతగా రెచ్చిపోయి ఉద్యమాలు చేస్తున్నారు  పాకిస్తాన్ లో.

కానీ నిజానికి అసలు ఇమ్రాన్ ఖాన్ ని అరెస్టు చేసి ఎక్కడ పెట్టింది లేదు. ఆయనని సేఫ్ గా ఒక గెస్ట్ హౌస్ లో ఉంచారు. అసలు ఇమ్రాన్ ఖాన్ ఎదిగిందే సైనిక సహకారంతో అని తెలుస్తుంది. ఒకప్పుడు సైనిక అధ్యక్షుడిగా ఉన్న భాజ్వా అప్పుడున్న ప్రభుత్వాన్ని కుప్పకూల్చి ఇమ్రాన్ ఖాన్ ను కుర్చీ ఎక్కించాడు. అప్పుడు బాజ్వా ఇమ్రాన్ ఖాన్ కు ఎవరు లేరులే అనుకున్నాడు. కానీ ఇమ్రాన్ ఖాన్ అప్పటికే పాకిస్తాన్ కి వరల్డ్ కప్ తెచ్చిన క్రికెటర్ అనే విషయం తెలుసుకోలేకపోయాడు.

ఇమ్రాన్ ఖాన్ భాజ్వా సైన్యంలోని వాళ్ళనంతా తన గ్రిప్ లోకి తెచ్చుకున్నాడు. అలాగే ఐఎస్ఐ సైన్యంలోనే జోక్యం చేసుకోవాలని అనుకున్నాడు. ఐ ఎస్ ఐ చీఫ్ ని కూడా మార్చడానికి ప్రయత్నించాడు. మొత్తానికి ఇమ్రాన్ ఖాన్ వల్ల సైన్యం రెండు వర్గాలుగా మారిపోయిందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: