మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్?
వందలాది మహిళలను ఉరితీసి, వేలాదిమంది మగవాళ్ళను కాల్చి చంపి, లక్షలాది మందిని జైల్లో వేసినటువంటి మత మూర్ఖత్వ ధోరణి కలిగిన దేశం ఇరాన్. అలాంటి దేశం భారతదేశం గురించి మాట్లాడుతుంది. భారతదేశంలో మత స్వేచ్ఛ గురించి మాట్లాడుతుంది. ఇక్కడ ముస్లింలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతుంది. తన దేశంలో తన మతానికి సంబంధించిన వాళ్ళు వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అక్కడ ఉన్నటువంటి ముస్లిం మత పెద్ద భారతదేశాన్ని విమర్శిస్తున్నాడు అని తెలుస్తుంది.
భారతదేశంలో ముస్లింలు దర్జాగా బతుకుతుంటే అదేం లేదని మోసం చేసేటువంటి పనిలో ఇరాన్ ఉన్నట్లుగా తెలుస్తుంది. సాంస్కృతిక సంబంధాల కోసం ఇండియన్ కౌన్సిల్ ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చారు ఈజిప్టు గ్రాండ్ ముఫ్తీ షౌకీ ఇబ్రహీం అబ్దుల్ కరీం అల్లన్. ఆయన హిందుస్థాన్ టైమ్స్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తీవ్రవాద దాడులకు పాల్పడే ముస్లింలు అనారోగ్య మనస్తత్వానికి ప్రాతినిధ్యం వహించే మైనారిటీలో భాగమని చెప్పారు.
గతంలో భారతదేశం గురించి కూడా రకరకాల కామెంట్లు చేసిన ఆయన ఇక్కడకు వచ్చేసరికి ఈ రకంగా కామెంట్స్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సిక్ మెంటాలిటీ ఎందువలన వస్తుంది, ఎవరి వల్ల వస్తుంది, ప్రపంచమంతా తమని వెతుకుతూ, తరుముతూ ఉన్నప్పుడు కూడా సిక్ మెంటాలిటీ ఉన్నవాళ్లు తమలో ఉన్నారని తెలిసినప్పుడు దానిని సరిచేసుకోవాల్సిన బాధ్యత మత పెద్దలుగా వాళ్ళకి ఉందా లేదా అనేది తాజాగా కొంతమంది అడుగుతున్న ప్రశ్న.