అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?
అలాగే ఆర్ 5జోన్ అంటే కృష్ణయపాలెం, వెంకటపాలెం, కురగొల్లు నిడమర్రు, మందడం, అయినవోలు గ్రామాల పరిధిలోని 967.25ఎకరాలను నివాస ప్రాంతాలుగా ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. అందులో 900.97ఎకరాలను ఆర్ 5జోన్ గా పేర్కొంటారు. పేదలు అక్కడ ఉంటే అది మురికివాడగా మారిపోతుంది అని 5శాతం పేదలు కూడా అక్కడ ఉండడానికి వీలు లేదంటూ అది కేవలం ధనవంతుల స్వర్గంగా ఉండడానికి మాత్రమే అంటూ జరిగిన ప్రయత్నం మీద ప్రజాస్వామ్య బద్ధంగా ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకుని స్పందించింది.
కానీ దాన్ని అడ్డుకోవడానికి శత విధాలా ప్రయత్నాలు జరిగాయని, క్రింది కోర్టు, పైకోర్టు, ఆ పైకోర్టు అలా ధర్మసనాల దాకా వెళ్లేందుకు రెడీ అయ్యారని తెలుస్తుంది. ఒక పక్కన మా దగ్గర భూములు లాగేసుకున్నారు, మాకు తినడానికి తినలేదు అని చెప్పుకువచ్చిన వాళ్ళు కూడా కోట్లు ఫీజులు చెల్లించి బడా బడా లాయర్లను పెట్టి మరీ అక్కడ పేదవాళ్లు ఉండడానికి లేకుండా చేసిన ప్రయత్నం మీదన, పోరాడి విజయం సాధించారు జగన్. ఒకరకంగా ఈ విజయాన్ని అడ్డుకోవాలనుకున్న వాళ్ళకి అతిపెద్ద చెంపపెట్టు, మరో పక్కన జగన్ మోహన్ రెడ్డి సాధించిన భారీ విజయం ఇది అని చెప్పాలని అంటున్నారు రాజకీయ నిపుణులు.