ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

పరిపాలనలో అత్యంత కీలకమైనది అవినీతి అంతం. పాలనలో  కొత్త కొత్త సంస్కరణలు తీసుకొచ్చారు. వాలంటీరు వ్యవస్థ. సచివాలయ వ్యవస్థ వల్ల కాస్త అవినీతి తగ్గింది.  ఎక్కువగా లంచాలు తీసుకునే  శాఖల్లో  రిజిస్ట్రేషన్ శాఖ, రెవెన్యూ శాఖ, వ్యవసాయ  శాఖ, రవాణ శాఖ ఉంటాయని ప్రజలు ఆరోపిస్తుంటారు. కొన్ని చోట్ల పోలీసు శాఖ పై కూడా ఆరోపణలు వస్తుంటాయి.

ప్రధానంగా లంచాలు తీసుకునే వారిని ఆయా శాఖల్లో ఉండే అధికారులపై ఎప్పటికప్పుడు ఏసీబీ రైడ్స్ చేస్తూ ఉండాలని ప్రజలు కోరుతున్నారు. ఇలా జరగాలంటే పాలనా అనుభవం ఉండాలి. అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కరి సమన్వయంతో ప్రభుత్వ శాఖలు అవినీతి లేకుండా పాలన చేయగలవు.

సీఎం జగన్ మీటింగ్ పెట్టి అడిగిన ప్రశ్నలో ఎక్కువ అవినీతి ఎక్కడ జరుగుతుంది అని అడగడంతో ఇలా కొన్ని శాఖల పేర్లు వినిపించాయి. జగన్ ఏసీబీ చీఫ్ ఎవరని అడిగారు. ఆ తర్వాత ఏసీబీ అధికారులను అవినీతి పరుల సంగతి చూడండని జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో రోజుకు ముగ్గురు, నలుగురు అధికారులు ఏసీబీకి పట్టు బడుతున్నారు.

లక్షల రూపాయల జీతం తీసుకుంటూ కూడా కోట్ల రూపాయల అవినీతి చేస్తున్న అధికారులు పట్టు బడుతుండటం అవినీతి చేస్తున్నారనే దానికి నిదర్శనం. మామూలుగా కాకుండా కళ్లు బైర్లు కమ్మేలా అవినీతి సొమ్మును కూడబెట్టుకుంటున్నారు.  ఉన్నతమైన పదవుల్లో ఉన్నవారే ఇలాంటి లంచాలకు మరిగినట్లు తెలుస్తోంది. ఏ పని చేయాలన్న చేయి తడపందే పరిస్థితి తలెత్తింది. దీనిపై జగన్ కు అందిన సమాచారం తోనే ఏసీబీ విస్తృతంగా దాడులు జరిపిస్తోంది.

కింది స్థాయి అధికారులు అవినీతి చేశారు.. లంచాలు ఆశించారంటే పోనీలే పాపం అనే వారు. కానీ లక్షలు, కోట్ల రూపాయలు సంపాదించే వారు. ఎక్కువగా అవినీతికి పాల్పడుతున్నారంటే సమాజంలో ప్రజల సొమ్మును రాబందుల్లా పీక్కుతుంటున్నారని అలాంటి అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ACB

సంబంధిత వార్తలు: