ఉద్యోగులకు హరీశ్‌రావు ఆ గుడ్ న్యూస్ చెబుతారా?
ప్రభుత్వం కూడా వేతనంతో పాటే తన వాటాను కూడా జమ చేయాలి. రెండు వాటాలను చెల్లింపుల అధికారులు నేరుగా ఆరోగ్య పథకానికి జమ చేసేలా తెలంగాణ ఉద్యోగ సంఘాలు ప్రతిపాదించాయి. ఉద్యోగులందరూ సమాన మొత్తాన్ని భరించి వారికి సమానమైన వైద్యసేవలను ఉచితంగా అందేలా పథకం ఉండాలని ఉద్యోగులు సూచించారు. ఒకవేళ ఎవరైనా ఉద్యోగి అదనపు సేవలు పొందాలని భావిస్తే పరిమితికి పైబడి ఉన్న మొత్తాన్ని సొంతంగా భరించాల్సి ఉంటుందని తెలంగాణ ఉద్యోగ సంఘాలు తెలిపాయి.
ఒక్కో ఉద్యోగికి ఆరు మంది యూనిట్ గా ఆరోగ్య కార్డులు ఇవ్వాలని తెలంగాణ ఉద్యోగ సంఘాలు ప్రతిపాదించాయి. మొత్తం పథకాన్ని సమీక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యోగ సంఘాలు ప్రతిపాదించాయి. ఆరు నెలలకు ఒకసారి పథకాన్ని సమీక్షించాలని తెలంగాణ ఉద్యోగ సంఘాలు కోరాయి. అలాగే మెడికల్ రీఎంబర్స్ మెంట్ వసతిని ఏడాది పాటు కొనసాగించాలని తెలంగాణ ఉద్యోగ సంఘాలు ప్రతిపాదించాయి.
అయితే.. ఈ ప్రతిపాదనలపై త్వరలో చర్చించి ఉద్యోగుల ఆరోగ్య పథకంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగ సంఘాల నుంచి ప్రతిపాదనలు అందుకున్న మంత్రి హరీశ్ రావు సానుకూలంగా స్పందించారని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల విజ్ఞప్తులపై ఏ మేరకు స్పందిస్తుందో చూడాలి.