ఓఆర్‌ఆర్‌ కుంభకోణం.. అనుమానాలు తీరేనా?

ఔటర్ రింగ్ రోడ్ టీఓటీ ప్రక్రియలో వేల కోట్లు చేతులు మారాయని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఆరోపణలు చేశాయి. అయితే ఈ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరిగిందని, జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ విధివిధానాల ప్రకారమే వెళ్లినట్లు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ అంటున్నారు. గత కొన్నాళ్లుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన మొత్తం ప్రక్రియపై  అర్వింద్ కుమార్ వివరణ ఇచ్చారు.


టీఓటీ బేస్ ప్రైస్ పెట్టాము కానీ బయటకు చెప్పలేదన్న  అర్వింద్ కుమార్.. ఎన్ హెచ్ ఏ ఐ కూడా బేస్ ప్రైస్ చెప్పడం లేదని పేర్కొన్నారు. బిడ్డింగ్ లో బేస్ ప్రైస్ కంటే ఎక్కువగా వచ్చిందని..  టోల్ నిబంధనలకు లోబడి మాత్రమే నడుచుకోవాల్సి ఉంటుందని అర్వింద్ కుమార్ అన్నారు.  అథారిటీ అనుమతి లేకుండా టోల్ చార్జీలు పెంచరాదని  అర్వింద్ కుమార్ స్పష్టం చేశారు. ప్రతి పదేళ్లకోమారు ఆదాయాన్ని సమీక్షిస్తామని, ఆదాయం అంచనాకు ఎక్కువగా ఉంటే కాలపరిమితి తగ్గించాలని నిబంధనల్లో ఉందని  అర్వింద్ కుమార్ తెలిపారు.


బిడ్డింగ్ గడువు 142 రోజులు ఉందని, ఆలోగా మొత్తం 7380 కోట్లు ఇవ్వకుండా ఓఆర్ఆర్  ను ఐఆర్ బీ కి అప్పగించమని అర్వింద్ కుమార్ స్పష్టం చేశారు. ఓఆర్అర్ ప్రస్తుతం ఉన్న ఆన్ని సేవలు అందుతాయని, ఎలాంటి మార్పు ఉండదని  అర్వింద్ కుమార్ అన్నారు. గ్రీనరీ నిర్వహణ మాత్రం హెచ్ఎండీఏ నే చేపడుతుందని  అర్వింద్ కుమార్ చెప్పారు. ట్రామా కేంద్రాల నిర్వహణ కూడా లీజు తీసుకున్న వారే చూడాలని  అర్వింద్ కుమార్ అన్నారు.


రాజకీయంగా ఏమైనా ఉండవచ్చు కానీ, అధికారులపై ఆరోపణలు తగదని  అర్వింద్ కుమార్ అన్నారు. వ్యక్తిగతంగా తనపై ఆరోపణలు దురదృష్టకరమని  అర్వింద్ కుమార్ అన్నారు. నిబంధనలకు లోబడి విధులు నిర్వర్తిస్తున్నామని, తనపై ఎలాంటి విచారణ అయినా చేసుకోవచ్చని  అర్వింద్ కుమార్ తెలిపారు. ఓఆర్ఆర్ పై మరో మూడు ఇంటర్ చేంజ్ లు ఏర్పాటు చేస్తామని... హెచ్ఎండీఏ ఖర్చుతోనే  వాటిని ఏర్పాటు చేస్తామని  అర్వింద్ కుమార్ వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ORR

సంబంధిత వార్తలు: