సుప్రీంకోర్టు విడాకుల తీర్పు భారత్‌కు చెడు చేస్తుందా?
కానీ అదే సమయంలో 498(ఏ) నిబంధన ప్రకారం భర్తతో దూరంగా ఉండొచ్చు. ఇద్దరికి ఇక పొసగదు అని తెలిసినా కోర్టు మరింత వేచి చూసే సమయం ఇస్తుండేది. దీంతో అనేక రకాల ఇబ్బందులు పడేవారు. పిల్లల ముందే కొట్టుకోవడం లాంటి పనులు చేయడంతో దాని ప్రభావం చిన్నారులపై పడేది. ఇప్పుడు ఆరు నెలలు కలిసి ఉండాలనే నిబంధనను తీసేయాలని సుప్రీం కోర్టు సూచించింది.
ప్రస్తుతం ఉన్న వివాహా బంధం లో చిన్న పాటి సమస్యల్ని కూడా పెద్దవిగా చేసుకుని విడాకుల వరకు వెళుతున్నారు. ఆడ, మగ ఇద్దరు సంపాదిస్తూ పెళ్లి చేసుకుంటున్నారు. విడాకులకు అసలు కారణాలు డబ్బుల విషయంలో మాట పట్టింపులు ఒక విషయమైతే, అత్తమామలను జాగ్రత్తగా చూసుకోక పోవడం మరో ప్రధాన అంశం.
కారణాలు ఏమైనా విడాకుల వైపే దంపతులు మొగ్గు చూపుతున్నారు. నచ్చకపోతే వెంటనే విడాకులు తీసుకోవచ్చన్న ప్రస్తుత నిబంధనలతో ఇప్పటికే వెయిట్ చేస్తున్న ఎన్నో జంటలు విడాకులు తీసుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఇలాంటి డిసెషిన్ వల్ల చాలా మంది అనాలోచితంగా తీసుకునే నిర్ణయాలకు బలయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో చిన్న గొడవలకే ప్రతి రోజు 10 నుంచి 20 వరకు విడాకుల కేసులు కోర్టు మెట్లెక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సుప్రీంకోర్టు దృష్టిలో ఒక రకంగా కొంతమంది బాధితులకు మంచి చేయాలని నిర్ణయమే. కానీ దీని వల్ల చాలా మంది బాధితులు నష్టపోతారనే వాదనలు బహిరంగంగా వినిపిస్తున్నాయి.