మోదీ సొమ్ముతో జగన్‌ పేరు తెచ్చుకుంటున్నారా?

ఇప్పుడు తాజాగా జగనన్న శాశ్వత భూ రక్ష అనే పేరుతో రాళ్ళేస్తున్నారు, జగనన్న ఫోటోలతో కాగితాలు కూడా ఇస్తున్నారు. అయితే దీనిపై ఇది కేంద్ర ప్రభుత్వ పథకం అని,  దీనినే రిసర్వే చేసి వీళ్ళ పేరుతో ఇస్తున్నారని కొంతమంది అంటున్న మాట. అసలు ఆ కేంద్ర ప్రభుత్వ పథకం వివరాలలోకి వెళ్తే భూ రికార్డుల కోసం 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు జాతీయ జనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఎన్జీడిఆర్ఎస్ అనే పేరుతో విధానాన్ని గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ నేతృత్వంలో తీసుకువచ్చింది.


భూ వనరుల విభాగం అందించిన తాజా సమాచారం ప్రకారం విశిష్ట భూ కొలతల గుర్తింపు సంఖ్య నేషనల్ పార్సిల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ యుఎల్పిఐఎన్ భూ ఆధార్ ని 23 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు ఆమోదించాయి. మరో ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ప్రయోగ ప్రాతిపదికన పేరు మీద ఈ విధానాన్ని పరిశీలించాయి. 18 ఏప్రిల్ 2023 నాటికి ఆరు లక్షల 22 వేల గ్రామాల్లో హక్కుల రికార్డుల కంప్యూటీకరణ పూర్తయింది.


భూ ఆధార్ అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మరో విప్లవాత్మకమైన సంస్కరణ అని కొంతమంది మేధావులు భావిస్తున్నారు. విదేశాల్లో ఇక్కడికి లాగా సర్వేయర్లు వచ్చి భూమిని కొలిచే పద్ధతి ఉండదు. అంతా అక్కడ ఆన్లైన్లోనే జరిగిపోతుంది. ఒక ఇంటిని సగంగా విభజించాలని లెక్క వచ్చినప్పుడు మాత్రమే నిబంధనలను కట్ చేయాల్సి వస్తుందని, మిగిలినదంతా సులభంగానే సాగిపోతుందని వాళ్లు అంటున్నారు.


అది కూడా ఫ్లాట్ ని ఫ్లాట్ లాగా,  స్థలాన్ని స్థలం లాగా అమ్మేస్తారట. అదే నిబంధన ఇప్పుడు ఇక్కడ రాబోతుందని 18 ఏప్రిల్ 2023 నాటికి ఆరు లక్షల ఇరవై రెండు వేల గ్రామాల్లో హక్కుల రికార్డుల కంప్యూటీకరణ పూర్తయిన నేపథ్యం ఇది. అయితే ఒక పక్కన పై నుండి కేంద్ర ప్రభుత్వం ఇంత కష్టపడుతుంటే కిందకి ఇక్కడికి వచ్చేసరికి, తమ స్టిక్కర్లు అంటించేస్తున్నారని  అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: