బ్రిటన్‌ వింత: నా మొగుడు దెయ్యం.. విడాకులు కావాలి?

అమెరికా,యూరప్ దేశాలు చాలా అభివృద్ధి చెందినవని అందరూ భావించుకుంటూ ఉంటారు కదా. నాగరికత బాగా పెరిగిన దేశాలు అనుకుంటూ ఉంటారు కదా. అలాగే భారతదేశం బాగా వెనుకబడిన దేశం మూఢనమ్మకాలు ఎక్కువ ఉన్న దేశం అంటూ, ఆ సంఘటనలను చూసి విచిత్రంగా అనుకుంటూ ఉంటారు కదా. అంటే బ్రిటన్ లో అలాంటివి ఉండవు అని, వాళ్లంతా పరిణితి చెందిన వారిని అనుకుంటూ ఉండేవాళ్ళకి ఇప్పుడు అక్కడ జరిగిన ఒక విచిత్రమైన తాజా సంఘటనను చూపిస్తే వాళ్ళు ఏమని సమాధానం చెబుతారో తెలియదు.

విషయంలోకి వెళ్తే అగ్రరాజ్యమైన బ్రిటన్ లో ఒక అమ్మాయి కోర్టులో కేసు వేసింది. అది తెలిసిన వాళ్ళందరూ ఇదేం విచిత్రం అని ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ విచిత్రం ఏమిటంటే బ్రిటన్ కి చెందిన ఒక అమ్మాయి తాను ఒక దెయ్యాన్ని పెళ్లి చేసుకున్నాను అని, ఆ దెయ్యం మొగుడు తనని నిద్రపోనివ్వడం లేదని, శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడని పోలీస్ కంప్లైంట్ పెట్టింది. దానితో పాటు  తమ పెళ్ళికి సంబంధించిన వీడియోను కూడా సాక్ష్యంగా చూపెట్టింది.

ఆ వీడియోలో విచిత్రం ఏమిటంటే ఒక పాస్టర్, అమ్మాయికి పెళ్లి చేస్తున్నాడు. ఒక ఆత్మ అమ్మాయి పక్కన ఉన్నట్టు, మాట్లాడుతున్నట్టు, వాళ్ళిద్దరూ ఒప్పుకున్నట్లుగా, పెళ్లి అయిపోయినట్లుగా వీడియోలో చెప్తున్నారు. ఇదే ఒక విచిత్రం అనుకుంటుంటే ఇప్పుడు ఆ అమ్మాయికి, ఆ వ్యక్తి నుండి విడాకులు కోరుకుంటుంది.

రాక్ బుకర్ అనే 38ఏళ్ల అమ్మాయి తాను దెయ్యాన్ని పెళ్లి చేసుకున్నానని, ఆ వ్యక్తి విక్టోరియా సైన్యంలో పని చేసినటువంటి ఎడ్వర్డ్ అని, ఆయన చనిపోయి ఆత్మ అయ్యాడని, మత గురువు తనకు పెళ్లి చేశారంటూ ఆ వీడియోని చూపించింది. భర్త తనను వెంటపడి మరీ వేధిస్తున్నాడని అతనిపై విరక్తి కలిగిందని, అప్పటికి పెళ్లై అయిదు నెలలు అయింది అని, ఇప్పుడు తనకి విడాకులు కావాలని కోర్టుకు ఎక్కడంతో ఈ విషయం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: