ఇండియాకు 'యాపిల్': అద్భుతాలు జరగబోతున్నాయా?
అశ్విని వైష్ణవితో ఇంకా నిర్మల సీతారామన్ తో కూడా చర్చలు ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. 25 ఏళ్ల క్రితం భారత్ లో వ్యాపారాలు మొదలుపెట్టిన యాపిల్ ఇప్పటికి తనకు సంబంధించిన 2 స్టోర్స్ ను ఇక్కడ పెట్టడం జరిగింది. ఇప్పటికే మోడీతో, ఇంకా అశ్విని వైష్ణవితో చర్చలు ఖరారు అయ్యాయట. మేకిన్ ఇండియాలో భాగంగా ఒక మిలియన్ డెవలపర్ జాబులు భారతదేశంలో ఖరారు చేసుకుంది. ఫాక్స్ కాన్, ఎకస్ట్రాన్, నిక్రాన్ ఈ మూడు సంస్థలు యాపిల్ కి సంబంధించిన మెటీరియల్స్ అందిస్తున్నాయి.
ఇప్పుడు భారత్ లో వీటి ప్రొడక్ట్ శాతం 12 నుండి 18 వరకు పెంచాలని అనుకుంటున్నారు. ప్రస్తుతానికి ప్రపంచానికి ఎగుమతి అవుతున్న ఫోన్లలో 5 శాతం మేడిన్ ఇండియావి. 2027 నాటికి వీటి శాతం 12 నుండి 18కు పెరుగుతుందనుకుంటే, లేదు 50% పెంచుతాం అంటుంది ఆపిల్ ఫోన్ సంస్థ. 2016 నుంచి ఈ గ్రోత్ ఆరంభమయ్యింది. 2017 లో చైనాకి అమెరికాకి మధ్య విభేదాలు మొదలైనప్పుడు ఇది ఇండియాకి వచ్చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది.
చైనా దగ్గర నైపుణ్యం ఉందని, మేము చైనా ని వదులుకోవాలని అనుకోవడం లేదని కాకపోతే కొత్త మార్కెట్లను కూడా పెంచుకోవడానికి భారతదేశం లో కూడా మొదలు పెడుతున్నామని చెప్పింది. అలా అన్నా కూడా ఆ సంస్థ తమ స్టోర్లను,చైనా నుండి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తగ్గించుకుంటూ వస్తుంది. అయితే ఇప్పుడు యాపిల్ స్టోర్స్ భారతదేశంలో సక్సెస్ అయితే అద్భుతంగా ఉంటుందని కొందరు అంటున్నారు.