వివేకా హత్య: జగన్‌ VS సునీత.. షర్మిల ఎటు?

వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పుడు కీలకంగా మారింది ఎంపీ టిక్కెట్ గొడవ విషయం. అప్పుడు ఒకవైపు అవినాష్ రెడ్డికి అప్పటికే టికెట్ కన్ఫామ్ చేసి, ప్రచారం కూడా జరుగుతూ ఉండగా, ఆ సమయంలో వివేకానంద రెడ్డి కూడా ప్రచారంలో పాల్గొంటూ పార్టీ గురించి ఆలోచించండి, అవినాష్ రెడ్డి గురించి కాదు, అవినాష్ రెడ్డిని పార్టీ నుంచి తీసేస్తాను, తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నన్ను ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓడించారు వాళ్ళ సంగతి చూస్తాను అని అన్నట్టుగా సిఐడి వాళ్ళు చెప్తున్నారు.

ఇది నిజమైతే వివేకానంద రెడ్డికి లోబడి జగన్ టికెట్ మారుస్తారా. తన తల్లి పైన పోటీ చేశారనే విషయంలో అసలు వివేకానంద రెడ్డి  పైకన్నా ఆయన అల్లుడు పై జగన్ కి కోపం ఉండేదట. ఎందుకంటే కాంగ్రెస్ తరపున కాంట్రాక్టు చూసుకునే వివేకానంద రెడ్డి బావమరిది ఇంకా అల్లుడు ఆ కాంట్రాక్టులు మధ్యలో ఆగిపోతే కష్టం కాబట్టి ఆయనను కాంగ్రెస్ పార్టీ నుండి  జగన్ సైడుకు రాకుండా చూసి వైయస్ విజయమ్మ పైనే పోటీ చేసేలా చేశారని తెలుస్తుంది.

ఈ విషయంపై కోపంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి తన తల్లి కోరిక మేరకు తర్వాత 2012లో  పార్టీలోకి, ఆ తర్వాత అడగ్గా అడగ్గా ఎంఎల్సి గా కూడా తీసుకోవడం జరిగింది. అలాంటి సందర్భంలో జగన్ వివేకానంద రెడ్డికి టికెట్ ఇస్తానన్నారా అంటే ఈ విషయంపై జగన్ గారు సమాధానం చెప్పాలని వాళ్ళు అంటున్నారు. గతంలో షర్మిల గారు ఈ వ్యవహారంలో ఎంపీ సీటు గొడవ ఉందని చెప్పుకొచ్చారు.

ఇప్పుడు వైయస్ విజయమ్మ గారు ఇంకా షర్మిల గారు ఇద్దరు అప్పుడు ఎంపీ సీటు విషయంలో తాము బాబాయ్ కే సీటు రెకమెండ్ చేయమని చెప్పడం వల్ల ఆయన ఆ తర్వాత రోజు ఎంపీ సీటు గురించి మాట్లాడే సమయానికి ఈ విధంగా జరిగిందని వాళ్లు చెప్తారా అనేదే ఇక్కడ కీలకమైనటువంటి విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: