సౌదీ అరేబియాకు బీసీసీఐ గట్టి షాకే ఇచ్చిందిగా?

సౌదీకి బీసీసీఐ పెద్ద షాక్ ఇచ్చింది. సౌదీ అరేబియా ఐపీఎల్ లాంటి లీగ్ మా దేశంలో నిర్వహిస్తాం. మీ ఇండియా ఆటగాళ్లకు సౌదీకి పంపండని బీసీసీఐకి ఆఫర్ ఇచ్చింది. ఇప్పటికే సౌదీ ఫుట్ బాల్, ఇతర టోర్నమెంట్లను నిర్వహిస్తూ ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. ఈ మధ్య ప్రపంచ స్టార్ ఫుట్ బాల్ ఆటగాడు రొనాల్డొను సౌదీ లీగ్ జట్టు అత్యంత డబ్బులు పోసి కొనుక్కుంది.

ఇదే విధంగా ఎన్ని డబ్బులు పెట్టడానికైనా సిద్ధమని భారత ఆటగాళ్లను సౌదీ పంపిస్తే చాలని చెప్పింది. దీన్ని బీసీసీఐ వ్యతిరేకించింది. ఎట్టి పరిస్థితుల్లో భారత ఆటగాళ్లు విదేశీ లీగ్ లలో ఆడరని తేల్చి చెప్పింది. అయితే ఇక్కడ ఒక సమస్య ఎదురవుతోంది. లలిత్ మోడీ మొదట ప్రవేశ పెట్టిన ఐపీఎల్ ఇంత విజయవంతం అవుతుందని ఎవరూ అనుకోలేదు. అప్పుడు కొనుక్కున్న జట్ల వ్యాల్యూ ఇప్పుడు వేల కోట్లల్లో అయింది. దీని వల్ల ఐపీఎల్ కు ఎక్కువ లాభం చేకూరుతోంది.

వ్యాపార, వాణిజ్య, టెలికాస్టింగ్, ఇలా అన్ని రంగాల్లో ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. దీని వల్ల ఇండియా ప్లేయర్స్ తో పాటు, ఇతర దేశస్థులు కూడా బాగా డబ్బు సంపాదిస్తున్నారు. అయితే దీనికి ధీటుగా ఎన్ని టీ 20 లీగ్ లను ప్రవేశపెట్టిన ఐపీఎల్ సాటి రావడం లేదు. ఇంత జనాలు రావడం లేదు. ఇన్ని డబ్బులు రావడం లేదు. అందుకే ప్రపంచ దేశాల్లోని ప్లేయర్లు ఐపీఎల్ లో రావడానికి ఇష్టపడతారు. ఒకవేళ సుప్రీంకోర్టు ఆదేశాలతో బీసీసీఐ నడుస్తుంది.

కోర్టు గనక విదేశీ లీగ్ లలో భారత ప్లేయర్లు ఆడటానికి అనుమతిస్తే చెప్పలేం. కానీ అది జాతీయ స్థాయి జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటికే ఐపీఎల్ 50 రోజులకు పైగా సాగుతోంది. దీని వల్ల అంతర్జాతీయ మ్యాచుల్లో చాలా వరకు జట్టుపై దీని ప్రభావం ఉంటుంది. విదేశీ లీగుల్లో ఆడేంత సమయం కూడా బీసీసీఐ షెడ్యూల్ లో ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ipl

సంబంధిత వార్తలు: