ఇక మావల్ల కాదు.. ఉక్రెయిన్ సైన్యం వెనుకడుగు?

ఉక్రెయిన్ లోని బాగ్ పుత్ ప్రాంతంలో వ్యుహాత్మక అడుగు వేస్తేనే వేరే ప్రాంతాల్లో కనీసం పోరాడేందుకు ప్రయత్నించవచ్చని ఉక్రెయిన్ సైన్యం ఆ దేశ అధ్యక్షుడిని కోరినట్లు జర్మన్ పత్రికలో వార్త కథనం ప్రచురితమైంది. అయితే దీనికి సంబంధించి జెలెన్ స్కీ బాగ్ పూత్ అనేది ఉక్రెయిన్ లోని అతి కీలక ప్రాంతం అక్కడ పోరాడితేనే రష్యా సైనిక బలగాలను వేరే ప్రాంతాలకు రానీవ్వకుండా ఉండ గలుగుతాం.


దేశం కోసం పోరాటం చేయాల్సిందేనని సైనికులకు చెప్పినట్లు సమాచారం. అయితే రష్యా, ఉక్రెయిన్ కు సంబంధించి జరుగుతున్న యుద్దంలో బాగ్ పుత్ ప్రాంతంలో రష్యా దళాలు భీకర దాడులు కొనసాగిస్తున్నాయి. ఈ సమయంలో వారితో పోరాడి ప్రాణాలు పోగొట్టుకునే బదులు వ్యుహత్మకంగా వెనకడుగు వేసి సమయం వచ్చినపుడు మళ్లీ ఎటాక్ చేస్తే సైనికుల ప్రాణాలు నిలుస్తాయని సైన్యం అడుగుతోంది.


కానీ దీనికి ఉక్రెయిన్ అధ్యక్షుడు ఒప్పుకోవడం లేదు. పోరాటం చేయాల్సిందేనని పట్టు బడుతున్నారు. సైన్యం మాత్రం అక్కడ పోరాటం చేస్తే పోయేది మా ప్రాణాలేనని అధ్యక్షుడిని వేడుకుంటోంది. ఇప్పటికే కేర్సన్ లాంటి ప్రాంతాల్లో రష్యా ఆధిపత్యం చెలాయించినా మళ్లీ అదే ప్రాంతంలో మన సైన్యం మళ్లీ పట్టు బిగించింది. ఇలా బాగ్ పుత్ ప్రాంతంలో కూడా పట్టు బిగించొచ్చు. ప్రస్తుతానికైతే తగ్గితే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


ఇప్పటికే యుద్దంలో కొన్ని వేల మంది సైనికులు మరణించారు. ఉక్రెయిన్ లో మాజీ సైనికులు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. గతంలో ఉన్న రూల్స్ కారణంగా ప్రతి ఒక్కరు చదువుకునే సమయంలోనే ఆర్మీ శిక్షణ తీసుకోవాలి. అలా తీసుకున్న వారు సైతం ప్రస్తుత యుద్ధంలో తమ వంతు సాయం అందిస్తున్నారు. ఇన్ని చేస్తున్న రష్యా ను మాత్రం అడ్డుకోవడం ఉక్రెయిన్ తరం కావడం లేదు. ఉక్రెయిన్ సైనికుల ప్రాణాలకు విలువనిస్తుందా.. లేక చనిపోయినా పర్లేదు కచ్చితంగా పోరాడాల్సిందే అని చెబుతుందా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

WAR

సంబంధిత వార్తలు: