యుద్ధం: చైనాకు షాక్ ఇచ్చిన జర్మనీ?
జర్మనీ విదేశాంగ మంత్రి అమనెల్లా బీర్‌బాక్ బీజింగ్‌లో జరిగిన వ్యూహాత్మక సమావేశాలలో వ్యూహాత్మక చర్చలు నిర్వహించడానికి చైనాలో మూడు రోజుల పర్యటన కోసం మూడు రోజుల నుండి బీజింగ్‌లో ఉన్నారు. జర్మన్ విదేశాంగ మంత్రి తైవాన్‌లో బల ప్రయోగానికి వ్యతిరేకంగా చైనాను హెచ్చరించారు. ఇంకా దానికి బదులుగా ఉక్రెయిన్ గురించి ప్రస్తావించారు. ఒకే చైనా విధానాన్ని ప్రపంచం లో ఎవరూ గౌరవించడం లేదని చెప్పుకొచ్చారు.
అక్కడకు వెళ్లి మీరు తైవాన్ లో మానవ హక్కుల ఉల్లంఘనలు చేస్తున్నారని తైవాన్ ని తైవాన్ లా బ్రతకనివ్వండి. మీ బ్రతుకు మీరు బ్రతకండి. ఎందుకని దాంట్లో వేలు పెడతారు అంటూ చైనాలో ప్రశ్నించింది ఆవిడ. ఈవిడ ఇలా ప్రశ్నించన దానికి బదులుగా వెంటనే చైనా కూడా అదే విధంగా స్పందించింది.
వన్ చైనా పాలసీని ప్రపంచ దేశాలన్నీ అంగీకరించాయి. నీ దేశం కూడా అంగీకరించింది. అందులో తైవాన్ ఏమీ ప్రత్యేక దేశం కాదు. అలా దాన్ని ఒక దేశం గా మీరు చూస్తున్నటువంటి నేపథ్యంలో అది మా దేశంలో ఉన్న ఒక ప్రావిన్స్ లాంటిది. కాబట్టి మీరు ఇన్వాల్వ్ కాకండి. ప్రపంచం కూడా ఇన్వాల్వ్ కావడం లేదు అంటూ అదే వేదిక మీద నుండి వార్నింగ్ ఇచ్చింది చైనా.