కర్ణాటక ఎలక్షన్స్‌: ఆ తెలుగు సీట్లే డిసైడ్ చేస్తాయా?

కర్ణాటకకు సంబంధించిన ఎన్నికలు ఘట్టం ముందుకు వచ్చేసింది. మనవారికి కూడా ఈ ఎలక్షన్స్ పై ఇంట్రెస్ట్ బాగానే ఉంటుంది. ఎందుకంటే మన పొరుగు రాష్ట్రం అనే కాకుండా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, రాయలసీమ ప్రాంతం వాళ్లు అక్కడ ఉన్నారు. ఇంకా కోస్తా జిల్లాలకు సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నారు. అందుచేత అక్కడ జరుగుతున్న వాటిపై మనకు కొంత ఇది ఉంటుంది.

మనకు తెలుగు రాష్ట్రాలపై అయితే ఏపీలో దీని ప్రభావం తక్కువగానీ, తెలంగాణ రాజకీయాలపై దీని ప్రభావం ఉంటుంది. కాబట్టి మన వాళ్లకు ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది అక్కడ రాజకీయాలపై. ప్రస్తుతం అయితే త్రిముఖ పోటీ లేదు, ద్విముఖ పోటీ మాత్రమే ఉంది. జిడిఎస్ క్రియాశీల పాత్ర పోషిస్తుందా అంటే డౌటే. అక్కడ కాంగ్రెస్ కి ఎడ్జ్ వస్తుందని సర్వేలు చెప్తున్నాయి. శివకుమార్ ని చేతిలోకి తీసుకుని సిద్ధరామయ్య ని పక్కన పెట్టిన నేపథ్యంలో కాంగ్రెస్ కే డామినేషన్ వస్తుందని అంటున్నారు.

కానీ అక్కడ స్వల్పమైన ఓట్ల తేడాతో, అంటే దాదాపు 5% లోపు ఓట్ల తేడాతో 63 సీట్లు, 2018 లో గెలుపు ఓటమిల ప్రభావితమైనాయి. 5 నుంచి 10 శాతం ఓట్ల తేడాతో 62 సీట్లు, 10 నుంచి 15 శాతం ఓట్లు తేడాతో 44, 15 నుంచి 20 శాతం ఓట్ల తేడాతో 24, 20 నుంచి 30 శాతం ఓట్ల తేడాతో 23, 30 శాతం కన్నా ఎక్కువ ఓట్ల తేడాతో 8 సీట్లు, ఇక్కడ మెయిన్ 5 శాతం ఓట్ల తేడాతో 63 సీట్లు.

కిందటి సారి 104సీట్లు వచ్చి సింగల్ లాజిస్టికల్ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీకి తగ్గినటువంటిది అతి స్వల్పం‌ ఓ 15-20సీట్లకు సంబంధించినటువంటి అంశం. అది లేకనే అప్పుడు కాంగ్రెస్ పార్టీ, జెడిఎస్ పార్టీలు కలిసాయి. మళ్లీ ఇప్పుడు అలాంటి పోటీ అక్కడ రాబోతుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: