ఉక్రెయిన్ తాజా చర్యలతో అణు యుద్ధం తప్పదా?
పోలండ్ వద్ద ప్రస్తుతం ఉన్న యుద్ధ విమానాలను ఇస్తే అది పోలండ్ మాపై దాడి చేసినట్లు పరిగణిస్తామని రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు మాత్రం రష్యా ను ఎదుర్కొనేందుకు ఆ యుద్ధ విమానాలు కావాల్సిందేనని కోరుతున్నారు. కానీ పోలండ్ పై రష్యా ఎటాక్ చేస్తే నాటో లో ఉన్న 30 దేశాలు దాని కోసం పోరాటం చేయాల్సిందే. అప్పుడు అది మూడో ప్రపంచ యుద్దంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రష్యా ఆ సమయంలో ఎలాగో వాటి దాడి నుంచి తప్పించుకునేందుకు అణు బాంబులను వాడుతుంది.
దీని వల్ల యూరప్ దేశాలు తీవ్ర మైన సంక్షోభంలోకి వెళ్లిపోతాయి. మూడో ప్రపంచ యుద్ధం వస్తే అణ్వస్త్రాల వాడకం వల్ల ప్రపంచం మొత్తం రేడియేషన్ పెరిగి మనుషులు తీవ్ర అనారోగ్యం పాలవుతారు. ఇక్కడ ఉక్రెయిన్ తో మాత్రమే పోతుందనకుంటున్న యుద్ధం కాస్త పోలండ్ వైపు వెళితే పరిణామాలు తీవ్రంగా నే ఉంటాయి. పోలండ్, ఉక్రెయిన్ నాటో దేశాలు అన్ని ఏకమైతే రష్యా ఊరుకుంటుందా... కచ్చితంగా అణు దాడి చేస్తుంది. మరి ఈ దాడి ఎంత భయానకంగా ఉంటుందోనని పలువరు దేశాధినేతలు ఆందోళన చెందుతున్నారు. యుద్ధాన్ని తప్పించి శాంతి మార్గంలో సమస్యను పరిష్కరించుకునేలా ప్రయత్నాలు చేయాలని ఆయా దేశాల్లోని మేధావులు, నిపుణులు కోరుతున్నారు.