అటు బీజేపీ.. ఇటు విపక్షాలు.. ప్రజాస్వామ్యం ఖూనీ?
విపక్షాలన్నీ పలు అంశాలపై చర్చించాలని గొడవ గొడవ చేస్తున్నాయి పార్లమెంటులో. అవకాశం ఇచ్చేస్తే ఒకరోజు రెండు రోజుల్లో మీ వాదన మీరు వినిపిస్తే, వాళ్ళ వాదన అనేది వాళ్ళు వినిపిస్తే పబ్లిక్ చూసుకుంటారు. కానీ వాదనకు అవకాశాలు ఇవ్వకుండా ఉభయ సభల్లోని తమ తమ హెడ్స్ ద్వారా ఆపించేస్తున్నారు. తద్వారా సభా సమావేశాలు అన్నీ అయిపోయాయి.
ప్రభుత్వం అలాంటి కుట్రలు చేస్తున్నప్పుడు విపక్షం ఏం చేయాలి. సరే అని చెప్పేసి ఆందోళనలు బయట చేసుకుంటూ, మిగతా టైం లో తీర్మానాల్లోని చర్చల్లో పాల్గొంటూ, ఆ చర్చల సందర్భంగా ఇట్లాంటి అంశాలను రైజ్ చేయవచ్చు. మీరు ఇలాంటి తప్పు చేశారు అనేటువంటి దాన్ని రైజ్ చేయొచ్చు. తద్వారా జనాల్లోకి వెళ్తుంది. బాధ్యతాయుతమైనది అవుతుంది.
బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ పై ఏ చర్చా లేకుండా 40 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఆమోదం పొందుతుంది. ఏ చర్చా లేకుండా బిల్లులు ఇష్టారీతిన ఆమోదం పొందుతున్నాయి. వీళ్ళందర్నీ ఎన్నుకున్నది ఎందుకు ప్రజలు, చర్చించి ప్రజా అవసరాల రీత్యా దానిలో ఉండాలని కదా. ఒక బిల్లులో ప్రభుత్వం లోపాలు చేస్తుంటే దానిలోని పాయింట్స్ ని విపక్షాలు ప్రస్తావించాలి. దానికి మూర్ఖంగా పోకుండా తమ వైఖరి చెప్పి అందులో తప్పు ఒప్పులను సరి చేసుకోవాల్సింది ఉంది. ప్రజా ప్రతినిధులనే వాళ్లను ఎన్నుకునేది అందుకే. కానీ ప్రజాస్వామ్యాన్ని చంపేసుకుంటున్నారు వీళ్ళు అందరూ కలిసి. నాయకుల ఆలోచన మారడం లేదు. వాళ్ళను మార్చవలసిన మనం కూడా మా వాళ్ళు మాట్లాడేది రైట్ అనే ఫీలింగ్ లో ఉండటమే ఇక్కడ మన తప్పు అవుతుంది.